Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని ఆశ్చర్యపరుస్తాయి, మరికొన్ని పగలబడి నవ్వించేలా చేస్తాయి. తాజాగా అలాంటి ఫన్నీ వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఒక మహిళ తన స్కూటీని ఇంటి నుండి బయటకు తీసేందుకు చేసిన ప్రయత్నం ఇప్పుడు ట్రెండింగ్లో నిలిచింది.
Viral Video: ఆ వీడియోలో ఆ మహిళ తన ఇంటి లోపల పార్క్ చేసిన స్కూటీని స్టార్ట్ చేసి, గేటు వైపు తీసుకువెళ్తుంది. గేటు ఇనుపతో తయారై ఉండటంతో, అది తాకగానే నెమ్మదిగా మూసుకుపోవడం ప్రారంభమవుతుంది. ఆమె స్కూటీపై కూర్చొని గేటు తెరవడానికి ప్రయత్నించినా అది పూర్తిగా తెరుచుకోదు. దీంతో స్కూటీని బ్యాలెన్స్ చేయడం కష్టమై, చివరికి దిగి గేటు తెరుస్తుంది.
అయితే అసలు ట్విస్ట్ అక్కడి నుంచే మొదలవుతుంది. స్కూటీని వెనక్కి లాగుతుండగా, ఇంటి బయట ఉన్న వాలు కారణంగా అది ఒక్కసారిగా వెనక్కి దూసుకెళ్లిపోతుంది. ఆ మహిళ ఎంత ప్రయత్నించినా ఆపలేకపోయింది. చివరికి స్కూటీతో పాటు ఆమె కూడా నేలపై పడిపోయింది.
🚨पूरा ही देखना : गाड़ी तो बाद में उठा लेंगे पहले दरवाजा तो बंद करे 😂 pic.twitter.com/UV6Hlnz44v
— Ramesh Tiwari (@rameshofficial0) September 2, 2025
ఈ ఫన్నీ వీడియోను Instagramలో @rameshofficial0 అనే అకౌంట్ షేర్ చేశాడు. కాసేపటికే వేలాది వ్యూస్తో పాటు వందలాది కామెంట్లు వచ్చి చేరాయి. నెటిజన్లు ఫన్నీ రియాక్షన్లతో కామెంట్ల విభాగాన్ని నింపేశారు. “ఆంటీ ప్రతిరోజూ ఇలా స్కూటీని బయటకు తీస్తుందా ఏమో!”, “బ్రదర్.. వీడియో చూసి నవ్వు ఆపుకోలేకపోయాను” అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఈ వీడియోను చూసిన వారంతా “ఇలాంటివి నిజంగానే జరుగుతాయా?” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఆ మహిళ చేసిన ఈ హాస్యాస్పద యాక్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
