Viral Video: పెళ్లికి సంబంధించిన వీడియోలు ఎప్పుడూ నెటిజన్లను కట్టుకుంటాయి. తాజాగా ఒక వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. పెళ్లి ఇంట్లో వధువు సిద్దంగా ఉండగా, ఆమె ప్రేమికుడు వచ్చి అందరి ముందే ముద్దు పెట్టుకుని, తనతో తీసుకెళ్లడం సోషల్ మీడియాలో పెద్ద సంచలనంగా మారింది. ఈ దృశ్యం చూసిన వారు ఇది సినిమా సన్నివేశమా లేక నిజమా అన్న సందేహంలో పడ్డారు.
Viral Video: సినిమాల్లో పెళ్లి రోజున ప్రేమికుడు లేదా ప్రేమికురాలు ప్రత్యక్షమై, కుటుంబానికి షాక్ ఇస్తారు. కానీ, ఈ వీడియో మాత్రం సినిమా కాదు, నిజమైన సంఘటన. Instagramలో flix.indian షేర్ చేసిన వీడియోలో యువకుడు తన ప్రియురాలిని పెళ్లి ఇంటి నుంచి తీసుకెళ్తున్నాడు. ఇల్లు మొత్తం అలంకరించబడి, వివాహ వాతావరణం ఉండగానే ఈ ఘటన జరిగింది. యువకుడు సింధూరం పెట్టి, ఆమె చేతిని పట్టుకుని బయటకు తీసుకెళ్లాడు.
ఇది కూడా చదవండి: Viral: ఆడుకుంటూ రూ.10 కాయిన్ మింగిన బాలుడు.. డాక్టర్ చాకచక్యంతో 2 నిమిషాల్లో ప్రాణ రక్షణ
ఆ సమయంలో అమ్మాయి కన్నీళ్లు పెట్టుకుంటుండగా, యువకుడు అక్కడున్న వారిని “ఏమైనా చేయండి చూద్దాం” అన్నట్లుగా సవాలు చేస్తూ ముందుకు నడిచాడు. పెళ్లి ఇంటి అతిథుల కళ్లముందే ఈ సంఘటన జరిగింది. దీంతో అక్కడ ఉన్నవారు షాక్ అయ్యారు.
ఈ వీడియోపై ఇప్పటికే 2.5 లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి. వేలాది మంది కామెంట్లు చేస్తున్నారు. కొందరు దీన్ని నిజమైన ప్రేమ విజయమని చెబుతుండగా, మరికొందరు తండ్రి గౌరవం గురించి ఆలోచించలేదని వధువును విమర్శిస్తున్నారు. ఇంకొందరు “బలవంతపు పెళ్లిళ్లకు ఇది సమాధానం.. తల్లిదండ్రులు తమ కుమార్తెల భావాలు గౌరవించాలి” అని కామెంట్ చేస్తున్నారు.
View this post on Instagram
