Viral Old Woman: వారం రోజులుగా తినలేక ఇబ్బంది.. వృద్ధ మహిళ కడుపులో 22సెం.మీ టూత్ స్టిక్ తొలగింపు!

Viral Old Woman: “ఏం తిన్నా గొంతు దిగడం లేదు.. మాట కూడా రావట్లేదు” అంటూ బాధపడిన ఓ వృద్ధురాలు చివరికి ఆసుపత్రిలో చేరింది. ఒడిశా గంజాం జిల్లాకు చెందిన కమరాజు నాయక్ (70) దాదాపు వారం రోజులుగా తినడానికి, తాగడానికి కూడా ఇబ్బందులు పడింది. స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నా ఫలితం లేకపోవడంతో చివరికి మహారాజా కృష్ణచంద్ర గజపతి (MKCG) మెడికల్ కాలేజ్ & హాస్పిటల్‌లో చేరింది.

Viral Old Woman: డాక్టర్లు పరీక్షలు చేయగా, ఆమె కడుపులో ఒక కట్టె పుల్ల (టూత్ స్టిక్) ఇరుక్కుపోయినట్టు తెలిసింది. వెంటనే ఆపరేషన్ చేసి 22 సెంటీమీటర్ల పొడవైన టూత్ స్టిక్‌ను విజయవంతంగా బయటకు తీశారు. కొన్ని రోజుల క్రితం ఉదయం దంతాలు తోముకునే సమయంలో పొరపాటున ఆ స్టిక్‌ను మింగేసినట్లు తేలింది. మొదట్లో కుటుంబ సభ్యులు నమ్మకపోయినా, తరువాత వృద్ధురాలు తినలేని స్థితి రావడంతో పరిస్థితి విషమించింది.

ఇది కూడా చదవండి: Viral Video: సినిమాని తలపించే సీన్.. పెళ్లింట్లో వధువును తీసుకెళ్లిన ప్రేమికుడు!

ENT విభాగాధిపతి డాక్టర్ సంజిత్ కుమార్ మిశ్రా ఆధ్వర్యంలో స్కానింగ్ చేసిన వైద్యులు టూత్ స్టిక్ ఆహారనాళంలో ఇరుక్కున్నట్లు గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స ప్రారంభించి ఒక గంటలోపే విజయవంతంగా తొలగించారు. ఈ ఆపరేషన్‌లో సర్జన్స్ సరితా దాస్, ప్రభీర్ కేశరి ప్రధాన్, సత్యస్వరూప్, సరితా మరాండితో పాటు అనస్తీషియాలజిస్ట్ బిపిన్ మాలిక్ పాల్గొన్నారు.

ప్రస్తుతం కమరాజు నాయక్ ఆరోగ్యం క్షేమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇంత పెద్ద టూత్ స్టిక్‌ను తొలగించడం అరుదైన ఘటన అని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు MKCG వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. చిన్న విషయాన్ని నిర్లక్ష్యం చేయకూడదని, లేని పొరపాట్లు ప్రాణాంతకమవుతాయని వైద్యులు మరోసారి హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *