Doctor Romance: ఇదేం పని డాక్టరూ.. నర్సుతో సరసం కోసం ఆపరేషన్‌ మధ్యలో వదిలేశావ్‌గా!

Doctor Romance: డాక్టర్ అంటే ప్రాణదాత. శస్త్రచికిత్సలో తప్పు జరిగితే రోగి ప్రాణం పోతుంది. అలాంటి కీలకమైన వృత్తిలో ఉన్న ఓ వైద్యుడు చేసిన చేష్టలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రోగి ఆపరేషన్ జరుగుతున్న సమయంలోనే డాక్టర్ ఆపరేషన్ థియేటర్ వదిలి నర్సుతో రొమాన్స్‌లో పాల్గొనడం పెద్ద సంచలనంగా మారింది.

Doctor Romance: ఈ సంఘటన గతేడాది సెప్టెంబర్ 16న బ్రిటన్‌లోని గ్రేటర్ మాంచెస్టర్‌లోని టేమ్‌సైడ్ హాస్పిటల్‌లో జరిగింది. 44 ఏళ్ల కన్సల్టెంట్ అనస్థీషియా నిపుణుడు డాక్టర్ సుహైల్ అంజుమ్, ఒక రోగికి పిత్తాశయ శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. రోగికి అనస్థీషియా ఇచ్చిన తర్వాత ఆపరేషన్ మధ్యలోనే బయటకు వెళ్లిపోయి, మరో ఆపరేషన్ థియేటర్‌లో నర్సుతో లైంగిక చర్యలో పాల్గొన్నట్టు విచారణలో తేలింది.

ఇది కూడా చదవండి: Trending: బాబోయ్.. భవనమా ఇది తేనెటీగల గూడు..! ప్రపంచంలోనే అతిపెద్ద నివాస భవనం.. ప్రత్యేకతలు తెలిస్తే!

ఒక సహోద్యోగి నర్స్ ఈ దారుణాన్ని గమనించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దాంతో విషయం వెలుగులోకి వచ్చింది. సుమారు ఎనిమిది నిమిషాల తర్వాత తిరిగి వచ్చిన డాక్టర్ శస్త్రచికిత్స పూర్తి చేశాడు. అదృష్టవశాత్తు రోగికి ఎలాంటి హాని జరగలేదు.

డాక్టర్ అంజుమ్ తన తప్పును ఒప్పుకొని, “ఇది చాలా సిగ్గుచేటు పని. నేను నా రోగిని, సహోద్యోగులను, వైద్య వృత్తి మీద నమ్మకాన్ని వమ్ము చేశాను” అని ట్రిబ్యునల్ ముందు అంగీకరించాడు. భార్యాభర్తల మధ్య ఉన్న ఒత్తిడి కారణంగా ఈ తప్పు జరిగిందని ఆయన చెప్పాడు.

ప్రస్తుతం ఆయన టేమ్‌సైడ్ హాస్పిటల్‌ను వదిలి పాకిస్తాన్‌కి వెళ్లిపోయాడు. అయితే భవిష్యత్తులో మళ్లీ యూకేలో తన వైద్య వృత్తిని కొనసాగించాలని కోరుకుంటున్నాడు. ఇది జీవితంలో ఒకసారి జరిగిన తప్పు మాత్రమేనని, ఇకపై జరగదని ప్యానెల్‌ను నమ్మబలికే ప్రయత్నం చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *