Fancy Numbers: హైదరాబాద్‌లో ఫ్యాన్సీ నంబర్ల క్రేజ్ మళ్లీ రుజువైంది. వాహన రిజిస్ట్రేషన్‌లో ప్రత్యేక నంబర్ల కోసం పోటీ పడుతూ వాహన యజమానులు లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. సెప్టెంబర్ 12న ఖైరతాబాద్ RTO కార్యాలయంలో నిర్వహించిన వేలం పాటలో రూ.63,77,361 ఆదాయం లభించింది.
Fancy Numbers: ఈ వేలంలో ఫార్మాస్యూటికల్ దిగ్గజం హెటెరో డ్రగ్స్ అగ్రస్థానంలో నిలిచింది. TG09J 9999 నంబర్‌ను కైవసం చేసుకోవడానికి వారు రూ.25,50,200 చెల్లించారు. ఇప్పటి వరకు ఫ్యాన్సీ నంబర్ కోసం చెల్లించిన అత్యధిక మొత్తంగా ఇది రికార్డు సృష్టించింది.
ఇది కూడా చదవండి: NEET UG 2025 Counselling: తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల!
ఇతర బిడ్ల వివరాలు
- TG09J 9990 నంబర్‌ను మీర్ అశ్వాక్ జహీర్ రూ.1.22 లక్షలకు దక్కించుకున్నారు.
- TG09H 0009 నంబర్‌ను ARL టైర్స్ రూ.6,50,009కు పొందింది.
- TG09J 0001 నంబర్‌ను డాక్టర్ రాజేశ్వరి స్కిన్ అండ్ హెయిర్ కేర్ సెంటర్ రూ.6,25,999 చెల్లించి తీసుకుంది.
- TG09J 0006 నంబర్‌ను AMR ఇండియా రూ.5,11,666కు పొందింది.
కొంతమందికి లక్కీ నంబర్లు, మరికొందరికి ప్రత్యేక సీరియల్స్ అంటే ఇష్టం. తమ వాహనానికి అలాంటి ప్రత్యేక నంబర్ ఉండాలని కోరుకునే వాహనదారులు లక్షలు వెచ్చించడానికి కూడా వెనుకాడటం లేదు. ఈ క్రేజ్‌ను ప్రభుత్వం ఆదాయ వనరుగా మార్చుకుంటోంది.
జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఒక్క రోజులోనే వచ్చిన రూ.63.77 లక్షల ఆదాయం ఫ్యాన్సీ నంబర్ల డిమాండ్ ఎంత ఉందో స్పష్టంగా తెలియజేస్తోంది.
