SBI Fraud: బ్యాంక్ ఖాతాల్లో రూ.4.60 లక్షల గోల్ మాల్ – మహిళల ఆగ్రహం!

SBI Fraud: కడెం మండలం లింగాపూర్ ఎస్బీఐ బ్రాంచ్‌లో జరిగిన ఘటన స్థానిక మహిళలందరినీ షాక్‌ చేసిందని చెప్పాలి. నర్సాపూర్ కాలనీ పంచాయతీకి చెందిన 16 మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు పొదుపు డబ్బులను బ్యాంకులో జమ చేసుకుంటూ, రుణాలను సకాలంలో తిరిగి చెల్లిస్తూ వస్తున్నారు. కానీ ఆరు నెలలుగా వారు తమ ఖాతాల్లోని డబ్బులను చూడలేదు.

SBI Fraud: ఒక సంఘ సభ్యురాలి ఆరా తరువాత, డబ్బులు లేవు అని తేలింది. తరువాత మరో మూడు గ్రూప్ సభ్యులు ఖాతాలను పరిశీలించగా, వారి ఖాతాలనూ ఖాళీగా చూసారు. మొత్తం 4.60 లక్షల రూపాయల డబ్బులు ఓ బ్యాంక్ బదిలీ ఉద్యోగి తన సొంత కోసం వాడినట్లు తేలింది.

ఇది కూడా చదవండి: Viral Video: ఇదేం పోయేకాలం 27 ఏళ్ల వధువు – 72 ఏళ్ల వరుడు..రాజరిక వివాహం!

బ్యాంక్ మేనేజర్ ఆగమేఘాలపై డబ్బులను జమ చేసినప్పటికీ, మహిళలు బ్యాంక్ పై నమ్మకం కోల్పోయారు. తాము పొదుపు చేసిన డబ్బులను విత్‌డ్రా చేసుకుని వెళ్లి, తమ సొంతంగా రక్షణ తీసుకున్నారు.

మెనేజర్ మధు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సమస్య టెక్నికల్ ఇష్యూ కారణంగా డబ్బులు ఖాతాల్లో జమ కాలేదని, ఇప్పుడీ సమస్యను సరిచేసి, డబ్బులు ఖాతాల్లో జమ చేశారని తెలిపారు. అయితే, సిబ్బంది నిర్లక్ష్యం పై ఆయన ప్రత్యక్షంగా వ్యాఖ్యానం చేయలేదు.

చెన్నూర్ గోల్డ్ లోన్ గోల్ మాల్ పై విచారణ కొనసాగుతున్న సమయంలో, ఈ ఘటన ఎస్బీఐపై విశ్వాసం తగ్గించేలా చేసింది. స్థానికులలో బ్యాంకులపై అనుమానాలు పెరిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *