Crime News: తండ్రి జోబులో డబ్బులు దొంగిలించిందని కూతురిని ఏకంగా..

Crime News: ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో పితృహృదయాన్ని కలిచివేసే ఘటనే జరిగింది. జేబులోంచి డబ్బు దొంగిలించిందని అనుమానం వచ్చి.. ఒక తండ్రి తన సొంత 13 ఏళ్ల కూతురినే కిరాతకంగా గొంతుకోసి హత్య చేశాడు.

Crime News: పోలీసుల సమాచారం ప్రకారం.. మృతురాలు బిచౌలా గ్రామానికి చెందిన సోనమ్‌ (13). ఆమె ఏడో తరగతి చదువుతోంది. గురువారం స్కూల్‌ ముగిశాక తండ్రి ఆమెను ఇంటికి తీసుకెళ్లకుండా పొలం వైపు తీసుకెళ్లాడు. అక్కడే పదునైన వస్తువుతో గొంతుకోసి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని కాలువలో పడేశానని విచారణలో ఒప్పుకున్నాడు.

ఇది కూడా చదవండి: Musi Floods: జలదిగ్బంధంలో MGBS బస్టాండ్.. బస్సుల రాకపోకలు నిలిపివేత!

శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో వంతెన కింద పొదల్లో స్కూల్‌ యూనిఫాంలో ఉన్న బాలిక మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

తన నేరాన్ని దాచిపెట్టేందుకు కూతురు బంధువుల ఊరికి వెళ్లిందని, కొన్ని రోజులు స్కూల్‌కి రాదని ఉపాధ్యాయులకు చెప్పినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

ఈ ఘటన విన్న ప్రతి ఒక్కరూ “ఛీ.. ఛీ.. తండ్రేనా?” అంటూ షాక్‌కు గురవుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *