Neet SS Exam: దేశవ్యాప్తంగా జరగనున్న NEET Super Specialty (NEET SS) 2025 పరీక్షను వాయిదా వేయాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాశారు.
Neet SS Exam: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలు, మహారాష్ట్రలో PG Medical 2022 బ్యాచ్ విద్యార్థుల ఫైనల్ ఇయర్ పరీక్షలు ఈ ఏడాది చివర్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 7, 8 తేదీల్లో జరగనున్న NEET SS పరీక్షలు విద్యార్థులకు కష్టతరమని ఆయన లేఖలో పేర్కొన్నారు. విద్యార్థుల సిద్ధతకు సమయం సరిపోకపోవడంతో, కనీసం ఒకటి రెండు నెలలపాటు పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఈ విజ్ఞప్తిపై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
ఇది కూడా చదవండి: High Court: భక్తుల రక్షణకు నడకదారిలో ఇనుప కంచె ఏర్పాటు చేయండి.. హైకోర్టు ఆదేశాలు
ఇక దివ్యాంగ అభ్యర్థుల విషయంలో కేంద్రం తాజాగా మార్గదర్శకాలను జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, వాటి అమలును 2025 డిసెంబరు 31 వరకు వాయిదా వేసింది.
వికలాంగుల సాధికారత శాఖ (DEPwD) విడుదల చేసిన మెమోరాండం ప్రకారం, సాంకేతిక సదుపాయాల కొరత, పరీక్షా సంస్థల్లో సంసిద్ధత లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీంతో ఈ ఏడాది చివరి వరకు జరగబోయే అన్ని పోటీ పరీక్షలు ప్రస్తుత చట్రంలోనే కొనసాగనున్నాయి.
ఈ నిర్ణయం వలన పోటీ పరీక్షలకు హాజరయ్యే దివ్యాంగ అభ్యర్థులకు కొంత ఊరట లభించింది
