Black Salt Benefits: మన వంటింట్లో సాధారణంగా తెల్ల ఉప్పు ఎక్కువగా వాడతాం. కానీ ఆరోగ్య పరంగా చూస్తే నల్ల ఉప్పు (Black Salt) అనేక అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. చాట్, సలాడ్లలో వాడే ఈ ఉప్పు రుచి పెంచడమే కాకుండా, ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది.
Black Salt Benefits: నల్ల ఉప్పులో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో, గ్యాస్, ఆమ్లత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా ఆకలి పెంచడంలో కూడా ఈ ఉప్పు ఉపయోగపడుతుంది.
ఇది కూడా చదవండి: AI Minister: AIకి మంత్రి పదవి.. వర్చువల్గా కేబినెట్లోకి డీయెల్లా!
హై బీపీ ఉన్నవారికి నల్ల ఉప్పు ఎంతో మేలు చేస్తుంది. సాధారణ ఉప్పుతో పోలిస్తే సోడియం స్థాయి తక్కువగా ఉండటంతో రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది. అదేవిధంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
నల్ల ఉప్పు శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో (Detox) కూడా పనిచేస్తుంది. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే బరువు తగ్గడంలో తోడ్పడుతుంది. జలుబు, దగ్గు సమస్యలకు పుక్కిలించడం ద్వారా ఉపశమనం ఇస్తుంది. వేడి నీటిలో కలిపి పాదాలను నానబెట్టడం ద్వారా కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
అయితే నల్ల ఉప్పును పరిమిత పరిమాణంలోనే వాడాలి. అధికంగా వాడితే దుష్ప్రభావాలు కలగవచ్చు. ప్రత్యేకంగా థైరాయిడ్, కిడ్నీ, హార్ట్ పేషెంట్స్ వైద్యుల సలహాతో మాత్రమే దీన్ని ఉపయోగించాలి.
