Hyderabad: జ్యూస్ తాగుతూ కుప్పకూలిన యువకుడు.. స్పాట్‌లోనే గుండెపోటుతో మృతి!

Hyderabad: హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలో జ్యూస్ తాగుతూ ఒక యువకుడు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. అతనికి గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

Hyderabad: సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమాచారం ప్రకారం, ఖమ్మం జిల్లా పల్లెపాడుకు చెందిన ఏకలవ్య (30) అనే యువకుడు మిత్రుడితో కలిసి ఇబ్రహీంపట్నంలో నివసిస్తున్నాడు. బుధవారం రాత్రి జ్యూస్ సెంటర్‌కి వెళ్లి జ్యూస్ తాగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

ఇది కూడా చదవండి: Viral Video: అమ్మ కదా అంతే మరి.. ఓవైపు కుటుంబ పోషణ.. మరోవైపు బిడ్డపై కేరింగ్!

అతన్ని గమనించిన స్థానికులు వెంటనే సీపీఆర్ చేసి ప్రాణాలు నిలబెట్టే ప్రయత్నం చేశారు. అదే సమయంలో పోలీసులకు సమాచారం అందించారు. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో పోలీస్ వాహనంలో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఏకలవ్య మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

30 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో యువకుడు మరణించడం అందరినీ కలచివేసింది. ఏకలవ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం మార్చురికి తరలించారు. ఈ ఘటనతో మిత్రులు, స్థానికులు తీవ్ర షాక్‌కు గురవుతూ, యువ వయసులోనే హార్ట్‌అటాక్‌లు పెరుగుతున్నాయన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *