Kalki 2: ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది.. కల్కి2లో దీపికా పదుకొణె ప్లేస్‌లో ఆ హీరోయిన్..?

Kalki 2: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం వెయ్యి కోట్ల క్లబ్‌లోకి చేరి ప్రభాస్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వైజయంతి మూవీస్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి తన స్టార్ పవర్‌ను నిరూపించుకున్నారు.

Kalki 2: కల్కి సినిమాలో కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెకు టాలీవుడ్ నుంచి వరుసగా షాకులు తగులుతున్నాయి. తాజాగా సందీప్ రెడ్డి వంగా – ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాలోనూ ఆమెను రీప్లేస్ చేశారు. తృప్తి దిమ్రీని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. దీపికా రోజుకు ఎనిమిది గంటలకే లిమిట్ పెట్టుకోవడం, ఎక్కువ పారితోషికం డిమాండ్ చేయడం, ఇంకా కథ వివరాలు బయటకు లీక్ అవ్వడం వంటివి ఈ నిర్ణయానికి కారణమని వార్తలు వస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Dipika Padukone: దీపికా మా మూవీలో లేదు . . ఇదే నిజం

తాజాగా కల్కి సీక్వెల్‌ నుండి కూడా దీపికా పదుకొణెను తప్పించినట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. రోజుకు ఎనిమిది గంటలకే కట్టుబడి ఉండే కమిట్‌మెంట్స్ ఈ ప్రాజెక్ట్‌కి సరిపడవని వారు స్పష్టం చేశారు. దీంతో అభిమానుల్లో కొత్త చర్చలు మొదలయ్యాయి.

ఇప్పుడు దీపికా స్థానంలో ఎవరు రాబోతున్నారు అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. సోషల్ మీడియాలో రెండు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఒకవైపు పూజా హెగ్డేను తీసుకుంటారని టాక్ ఉండగా, మరోవైపు అనుష్క శెట్టి రీ-ఎంట్రీ ఇస్తారని చర్చ నడుస్తోంది. అయితే కొంతమంది సినీ వర్గాలు మాత్రం – కల్కి సినిమాలో దీపికా పాత్రను మొదటి పార్ట్‌తోనే ముగిస్తారని, సీక్వెల్‌లో ఆ పాత్ర కొనసాగదని అంటున్నారు.

ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం దీపికా రీప్లేస్‌మెంట్‌పై క్లారిటీ కోసం ఎదురుచూస్తున్నారు. నాగ్ అశ్విన్ ఈ విషయంలో త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. అప్పటివరకు మాత్రం ఈ చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Kalki 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *