Ahmedabad: మధ్యప్రదేశ్లోని రత్లాం జిల్లాకు చెందిన 7 ఏళ్ల శుభమ్ నిమానా అరుదైన వ్యాధితో బాధపడ్డాడు. గత రెండు నెలలుగా అతడికి తీవ్ర కడుపునొప్పి, వాంతులు, బరువు తగ్గడం వంటి సమస్యలు ఎదురవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ప్రైవేట్ ఆస్పత్రిలో సుమారు రూ.2 లక్షలు ఖర్చు చేసినా పరిస్థితి మెరుగుపడకపోవడంతో చివరికి అతడిని అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
Ahmedabad: అక్కడ వైద్యులు చేసిన CT స్కాన్, ఎండోస్కోపీ పరీక్షల్లో బాలుడి కడుపు, చిన్న ప్రేగులో అసాధారణ ముద్దలా ఏదో పేరుకుపోయినట్లు గుర్తించారు. వైద్యపరిభాషలో దీనిని ట్రైకోబెజోవర్ (Trichobezoar) అంటారు. శుభమ్ కడుపులో జుట్టు, గడ్డి, షూలేస్ దారాలు గూడి పెద్ద ముద్దగా తయారై ఉన్నాయని డాక్టర్లు కనుగొన్నారు.
ఇది కూడా చదవండి: Video Controversy: మరో కాంట్రవర్సీలో బిగ్ బాస్ బ్యూటీ .. హీరో భార్య బయటపెట్టిన వీడియోలు కలకలం!
డాక్టర్ రామ్జీ నేతృత్వంలోని బృందం బాలుడి కడుపులోని ఆ ముద్దను లాపరోటమీ శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా తొలగించింది. ఆపరేషన్ అనంతరం ఆరు రోజులపాటు ద్రవ ఆహారం మాత్రమే ఇచ్చి, ఏడో రోజుకు శుభమ్ పూర్తిగా కోలుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు.
తరువాత బాలుడికి మానసిక వైద్యుల ద్వారా కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. డాక్టర్లు మాట్లాడుతూ – “పిల్లల్లో ట్రైకోబెజోవర్ చాలా అరుదైన సమస్య. కేవలం 0.3% నుంచి 0.5% పిల్లల్లో మాత్రమే కనిపిస్తుంది. పిల్లలలో ఏవైనా అసాధారణ ప్రవర్తన కనిపిస్తే, తల్లిదండ్రులు వెంటనే వైద్యులను సంప్రదించాలి” అని సూచించారు.
View this post on Instagram
