Dharmendra Pradhan: పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నివాళులర్పణలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ విగ్రహం వద్ద కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా, ఇతర నేతలు పూలమాలలు వేసి గౌరవం తెలిపారు.
Dharmendra Pradhan: ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రదాన్ మాట్లాడుతూ – “భారతీయ ఆలోచనలకు ప్రముఖ స్తంభం అయిన పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మనందరికీ స్ఫూర్తిదాయకం. భారత విద్య, అభివృద్ధి గురించి ఆయన విస్తృతంగా చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన ఆలోచనల ఆధారంగా సంక్షేమ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. దశాబ్దాల క్రితం ఉపాధ్యాయ గారు ప్రస్తావించిన సమగ్ర మానవతావాద తత్వం నేడు మార్గదర్శిగా నిలుస్తోంది” అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Bihar Elections: ఆ సీట్లు వదిలేస్తే మద్దత్తు అంటు అసదుద్దీన్ ఒవైసీ ఓపెన్ ఆఫర్.. కానీ,!
తరువాత ఎక్స్ వేదికగా కూడా స్పందించిన ధర్మేంద్ర ప్రదాన్ – “నాలాంటి లక్షలాది మంది కార్మికులకు మార్గదర్శి అయిన గౌరవనీయులైన పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా, ఆయన విగ్రహానికి పూలమాలలు సమర్పించాను. సమగ్ర మానవతావాదం, అంత్యోదయ వంటి ప్రగతిశీల ఆలోచనలతో భారత రాజకీయాలకు కొత్త దిశను చూపించారు. సమాజంలోని చివరి వ్యక్తి వరకు అభివృద్ధి, సంక్షేమం చేరినప్పుడే నిజమైన సామాజిక అభ్యున్నతి సాధ్యమని ఆయన నమ్మారు. భారత రాజకీయాలు, సమాజానికి ఉపాధ్యాయ చేసిన కృషి మరువలేనిది. ఆయన దార్శనికత ఎల్లప్పుడూ బలమైన, స్వావలంబన గల భారత నిర్మాణానికి స్ఫూర్తినిస్తుంది” అని ట్వీట్ చేశారు.
#WATCH दिल्ली: केंद्रीय मंत्री धर्मेंद्र प्रधान ने कहा, “आज भारतीय विचार के प्रमुख स्तंभ पंडित दीनदयाल उपाध्याय जी की जन्म जयंती है। वे हम सभी की प्रेरणा के स्रोत हैं… उन्होंने पर्याप्त मात्रा में भारत की शिक्षा और रचना पर उल्लेख किया है… उन्हीं के विचारों के आधार पर… https://t.co/Be6DviJxmE pic.twitter.com/Mqlm1y9Zmy
— ANI_HindiNews (@AHindinews) September 25, 2025
मेरे जैसे करोड़ों कार्यकर्ताओं के पथ-प्रदर्शक श्रद्धेय पंडित दीनदयाल उपाध्याय जी की जयंती पर दीनदयाल उपाध्याय पार्क स्थित उनकी प्रतिमा पर उन्हें पुष्पांजलि अर्पित कर नमन किया।
भारतीय राजनीति में एकात्म मानववाद और अंत्योदय जैसे प्रगतिशील विचारों से समाज को एक नई दिशा देने का… pic.twitter.com/RLVYRTJWUi
— Dharmendra Pradhan (@dpradhanbjp) September 25, 2025
