OG Movie: పవర్ స్టార్ క్రేజ్.. పవన్ కెరీర్‏లోనే అరుదైన బాక్సాఫీస్ రికార్డు!

OG Movie: ప్రస్తుతం OG (ఓజీ) సినిమా బాక్సాఫీస్ వద్ద పవన్ మేనియాతో దూసుకుపోతోంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ చాలా రోజులుగా ఈ మూవీ విడుదల కోసం ఎదురుచూసిన సందర్భంలో, సెప్టెంబర్ 25న భారీ అంచనాల మధ్య థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ భారతీయ సినిమా చరిత్రలోనే ప్రత్యేక ఘనత సాధించేందుకు సిద్ధంగా ఉంది.

OG Movie: పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఓజీ, డైరెక్టర్ సుజీత్ ప్రతిష్టాత్మక దర్శకత్వంలో తెరకెక్కింది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో ప్రియాంక మోహన్, ప్రకాష్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, శ్రియా రెడ్డి కీలకపాత్రలు పోషించారు. గ్యాంగ్స్ డ్రామా థీమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సినిమా అడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ పొందుతోంది.

ఇది కూడా చదవండి: OG Movie: పవన్ ఫ్యాన్స్‏కు హిట్ కిక్ ఇచ్చిన డైరెక్టర్ సుజీత్ – పూర్తి బ్యాక్గ్రౌండ్!

OG సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ దాటింది. ఈ సంవత్సరం ప్రారంభంలోనే వరల్డ్ వైడ్ రూ.67 కోట్లకు పైగా వసూలు చేసి పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అతిపెద్ద ఓపెనర్‌గా నిలిచింది. ట్రేడ్ నిపుణుల అంచనాల ప్రకారం, సినిమా మొదటి రోజే రూ.150 కోట్లకు పైగా వసూలు చేయడం ఖాయమని భావిస్తున్నారు.

గతంలో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ (రూ.104 కోట్లు), యానిమల్ (రూ.114 కోట్లు), సాహో (రూ.126 కోట్లు), జవాన్ (రూ.129 కోట్లు) మొదలైన బ్లాక్‌బస్టర్‌ల మొదటి రోజు కలెక్షన్‌లను OG దాటనుంది. అందువల్ల, ఓజీ సినిమా భారతీయ చిత్రాలలో అతిపెద్ద ఓపెనింగ్స్‌లో టాప్ 10లో ఉండడం దాదాపు ఖాయం.

సినిమా కథ ఓజాస్ గంభీర (పవన్ కళ్యాణ్) పాత్ర చుట్టూ తిరుగుతుంది. పవన్ కళ్యాణ్ నటన, సుజీత్ దర్శకత్వం, థమన్ మ్యూజిక్ కలయిక సినిమాకు విశేష ఆకర్షణను అందిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *