Asia Cup 2025 Trophy: అన్నట్టే చేశారు . . ఛా.. మీరు మాకు పోటీ ఏమిటి ? అన్న టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాటల్ని నిజం చేస్తూ పాకిస్తాన్ ను చిత్తు చేసి ఆసియా కప్ టోర్నీని గెలిచారు . కప్ గెలుస్తాం . . కానీ ట్రోఫీని పాక్ జాతీయుడి చేతుల మీదుగా మేము తీసుకోము అని చెప్పిన మాటల్ని నిలబెట్టుకున్నారు. గెలిచారు . . కప్ తీసుకోలేదు. పాకిస్తాన్ ను ఘోరంగా అవమానిస్తూ . . పాకిస్తాన్ దుశ్చర్యలపై ప్రతి భారతీయుడికి ఉన్న కసిని ప్రతిబింబిస్తూ . . పాకిస్తాన్ పై ముమ్మారు గెలిచి . . యుద్ధమైనా . .ఆటైనా . . సరైన తీరులో సాగితే మాకు ఎదురులేదు అన్నట్టుగా సంకేతాన్నిచ్చింది భారత్ క్రికెట్ జట్టు . ఆసియా కప్ ఫైనల్స్ లో ఘన విజయం సాధించిన తరువాత పాకిస్తాన్ కు చెందిన PCB చీఫ్.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ నుండి ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించింది. ఎవరేం చెప్పినా . . ఎంత నచ్చ చెప్పినా . . ఆయన తప్ప ఎవరు ఇచ్చినా ట్రోఫీ తీసుకుంటామంటూ టీమిండియా స్పష్టం చేసింది . దాదాపు గంట పాటు చెప్పినా వినలేదు . దీంతో ట్రోఫీ ఇవ్వకుండానే ఆసియా కప్ ఛాంపియన్ షిప్ పోటీలు ముగించేశారు . క్రికెట్ చరిత్రలో ఆ మాటకొస్తే ప్రపంచ క్రీడల పోటీల చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి అయిఉండవచ్చు .
జరిగింది ఇదే . .
Asia Cup 2025 Trophy: ఆసియా కప్ ఫైనల్ లో ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై ఘన విజయం సాధించింది టీమిండియా . భారతదేశం తొమ్మిదవసారి ఆసియా కప్ను గెలుచుకుంది. విజయం తర్వాత, భారత జట్టు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చీఫ్ మొహ్సిన్ నఖ్వీ నుండి ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించింది. దీనితో పతకాల ప్రదానోత్సవం ప్రారంభం గంట ఆలస్యం అయింది. నఖ్వీ ఒత్తిడితో, భారత జట్టును మరే ఇతర అధికారి నుండి ట్రోఫీని స్వీకరించడానికి అనుమతించలేదు. అప్పుడు భారత ఆటగాళ్ళు ట్రోఫీ లేకుండా సంబరాలు చేసుకున్నారు. ఇంతలో, నఖ్వీ ట్రోఫీని మైదానం నుంచి తీసివేయించారు .
భారత్ డ్రెస్సింగ్ రూమ్ లో ఉండడమే నాకు ట్రోఫీ . .
మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను ట్రోఫీ(Asia Cup 2025 Trophy) గురించి అడిగారు. సూర్య మాట్లాడుతూ, “నేను క్రికెట్ ఆడుతున్న తర్వాత ఛాంపియన్ జట్టుకు ట్రోఫీ అందజేయకపోవడం ఇదే మొదటిసారి. ఈ టోర్నమెంట్ గెలవడానికి మేము చాలా కష్టపడ్డాము. ఏమైనా, అది పర్వాలేదు. మా ఆటగాళ్లందరూ మరియు సహాయక సిబ్బందితో భారత డ్రెస్సింగ్ రూమ్లో ఉండటమే నాకు ట్రోఫీ.”
ఐసీసీకి ఫిర్యాదు చేస్తాం . .
“భారత జట్టు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారి నుండి ట్రోఫీ(Asia Cup 2025 Trophy(Asia Cup 2025 Trophy)ని స్వీకరించకూడదని మేము నిర్ణయించుకున్నాము. PCB చీఫ్ ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ కూడా, కాబట్టి మా ఆటగాళ్ళు అతని నుండి ట్రోఫీ లేదా పతకాన్ని అంగీకరించలేదు” అని BCCI కార్యదర్శి దేవ్జిత్ సైకియా ANI కి తెలిపారు. దీని అర్థం నఖ్వీకి భారత్ ట్రోఫీని లేదా పతకాన్ని పాకిస్తాన్కు తీసుకెళ్లే అర్హత ఉంటుందని కాదు. ఐసిసి సమావేశం నవంబర్లో ఉంది. అక్కడ నఖ్వీ చర్యలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాము. త్వరలో మా ట్రోఫీని అందుకోవాలని మేము ఆశిస్తున్నాము అని సైకియా పేర్కొన్నారు .
ఆట వేరు . .
పహల్గామ్ ఉగ్రవాద దాడి.. ఆపరేషన్ సిందూర్ తర్వాత, ఆసియా కప్లో టీం ఇండియా పాకిస్తాన్తో ఆడకూడదనే డిమాండ్ భారతదేశంలో గట్టిగా వినిపించింది . అయితే . . ప్రభుత్వ నిర్ణయం మేరకు భారత జట్టు మ్యాచ్ను బహిష్కరించకపోయినా, టోర్నమెంట్ అంతటా దాని ఆటగాళ్ళు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయకుండా ఉన్నారు. టోర్నమెంట్ ప్రారంభంలో, జట్టు గెలిస్తే, ఏ పాకిస్తాన్ అధికారి నుండి ట్రోఫీని స్వీకరించకూడదని భారతదేశం నిర్ణయించుకుంది.
ట్రోఫీ లేకుండా సంబరాలు . .
గెలుపును సంబరంగా చేసుకోవాలి కదా . . దానికి ట్రోఫీ(Asia Cup 2025 Trophy) ఎందుకు ? కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన సహచరులకు ట్రోఫీని మోస్తున్నట్లుగా తన చేతులతో సైగ చేశాడు. ఇతర ఆటగాళ్లు అదే నిజమైన ట్రోఫీ అని భావించి సంబరాలు చేసుకున్నారు. గ్రౌండ్ అంతా కలియ తిరిగి అలానే సంబరాలు చేసుకున్నారు భారత ఆటగాళ్లు .
