Gautam Gambhir: విరాట్ కానేకాదు..అసలైన ‘రన్ మెషిన్’ అతనే..గంభీర్ సంచలన వ్యాఖ్యలు!

Gautam Gambhir: ఆసియా కప్ ప్రారంభానికి ముందే టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎప్పుడూ విరాట్ కోహ్లీపై సూటిగా విమర్శలు చేస్తూ, తన అభిప్రాయాలను ధైర్యంగా బయటపెట్టే గంభీర్ ఈసారి మరింత ఘాటు వ్యాఖ్య చేశాడు. క్రికెట్ అభిమానులు కోహ్లీని ప్రేమతో ‘రన్ మెషిన్’ అని పిలుస్తుంటారు. అయితే గంభీర్ మాత్రం ఆ ట్యాగ్‌ను కోహ్లీకి ఇవ్వకుండా, మాజీ క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్‌నే అసలైన పరుగుల యంత్రం అని పిలిచాడు.

Gautam Gambhir: 2025 ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) ఫైనల్ సందర్భంగా అభిమానుల సెషన్‌లో గంభీర్ పాల్గొన్నాడు. అక్కడ ఒక గేమ్‌లో ఆటగాళ్లకు ప్రత్యేక ట్యాగ్‌లు ఇవ్వాల్సి రావడంతో, గంభీర్ వరుసగా అనేకమంది క్రికెటర్ల పేర్లు చెప్పాడు. సచిన్ టెండూల్కర్‌ను ‘క్లచ్ ప్లేయర్’, జస్ప్రీత్ బుమ్రాను ‘స్పీడ్’, రాహుల్ ద్రవిడ్‌ను ‘మిస్టర్ కన్సిస్టెంట్’ అని పిలిచాడు. విరాట్ కోహ్లీకి మాత్రం ‘దేశీ బాయ్స్’ అనే ట్యాగ్ ఇచ్చి, అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు.

అంతేకాక, గంభీర్ తన శిష్యుడు నితీష్ రాణాను ‘గోల్డెన్ హ్యాండ్’, శుభ్‌మాన్ గిల్‌ను ‘మోస్ట్ స్టైలిష్’, జహీర్ ఖాన్‌ను ‘డెత్ ఓవర్ స్పెషలిస్ట్’, రిషబ్ పంత్‌ను ‘ఫన్నియెస్ట్ ప్లేయర్’ అని పేర్కొన్నాడు. కానీ విరాట్ కోహ్లీ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌నే అసలైన ‘రన్ మెషిన్’ అని పిలవడం చర్చనీయాంశమైంది.

ఇక, ఆసియా కప్ టీ20 సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమవుతుంది. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ (2-2) అనంతరం విశ్రాంతి తీసుకున్న భారత జట్టు ఈ టోర్నమెంట్‌కి సిద్ధమవుతోంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు సెప్టెంబర్ 10న ఆతిథ్య యూఏఈతో, అలాగే సెప్టెంబర్ 14న పాకిస్థాన్‌తో ఆడనుంది.

ఈ వ్యాఖ్యలతో కోహ్లీ అభిమానులు సోషల్ మీడియాలో గంభీర్‌పై తీవ్రంగా స్పందిస్తున్నారు. మరికొందరు మాత్రం గంభీర్ నిజమే చెబుతున్నాడని సమర్థిస్తున్నారు. ఏదేమైనా, ఆసియా కప్‌లో భారత జట్టు ప్రదర్శన గంభీర్ కోచ్‌గా ఉన్న ప్రతిష్టను నిర్ణయించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *