Viral Video: సాధారణంగా విమానం ఆలస్యమైతే ప్రయాణికులు ఆగ్రహానికి లోనవుతారు. ఎయిర్‌లైన్ సిబ్బందిపై కోపం చూపిస్తారు. కానీ గోవా ఎయిర్‌పోర్ట్‌లో మాత్రం భిన్నమైన సీన్ కనిపించింది. ఇక్కడ ప్రయాణికులు కోపం చూపించకుండా గర్బా నృత్యంతో కాలక్షేపం చేశారు.
Viral Video: ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం గోవా నుంచి సూరత్‌కి వెళ్లాల్సి ఉంది. అయితే పైలట్ అస్వస్థతకు లోనవడంతో ఫ్లైట్ ఆలస్యమైంది. దీంతో సూరత్‌లో జరగబోయే గర్బా ఫంక్షన్‌కు హాజరు కాలేకపోతానని ఒక ప్రయాణికుడు మయూర్ నిరుత్సాహం వ్యక్తం చేశాడు.
ఇది కూడా చదవండి: Bride Runs Away: పెళ్లి ఘనంగా జరిగింది.. కార్యం కోసం పెళ్ళికొడుకు గదిలో ఎదురుచూపులు.. భార్య ఎంతికి రాకపోయేసరికి వెళ్లి చూడగా..!
అతడ్ని ఉత్సాహపరచడానికి ఇండిగో సిబ్బంది ఎయిర్‌పోర్ట్‌లోనే స్పీకర్లు ఏర్పాటు చేసి గర్బా సంగీతం ప్లే చేశారు. దీంతో ప్రయాణికులు అందరూ కలిసి గర్బా డ్యాన్స్ చేశారు. సిబ్బందీ కూడా వారితో చేరి సందడి చేశారు.
ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లో డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో పంచుకోగానే వైరల్‌గా మారింది. కొందరు దీనిని మరచిపోలేని అనుభవంగా పొగిడితే, మరికొందరు విమానాశ్రయ మర్యాదను దెబ్బతీశారని విమర్శించారు.
