Stray Dogs Attack: కామారెడ్డిలో పిచ్చికుక్కల విజృంభణ – 3 రోజుల్లో 30 మందిపై దాడి

Stray Dogs Attack: కామారెడ్డి జిల్లాలో వీధి కుక్కల బెడద పెరిగిపోతోంది. మూడు రోజుల వ్యవధిలోనే పిచ్చికుక్కలు 30 మందిపై దాడి చేశాయి. దీంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

ఒక్కరోజులో 14 మందిపై దాడి

Stray Dogs Attack: రేగిడి మండలం అంబకండిలో ఒక్క రోజే 14 మందిపై పిచ్చికుక్కలు దాడి చేశాయి. గాయపడిన బాధితులు ప్రభుత్వ ఆసుపత్రులకు చేరుకున్నారు. రాజంపేటలో ఐదేళ్ల బాలుడు ధనుంజయ్‌పై కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతనిని ఐసియులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

పట్టణంలోనూ, గ్రామాల్లోనూ భయం

కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్, శ్రీరామ్ నగర్, వివేకానంద కాలనీ, పెద్ద బజార్ ప్రాంతాల్లో కుక్కల దాడులు ఎక్కువయ్యాయని స్థానికులు చెబుతున్నారు. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతూ పిల్లలు, వృద్ధులు, మూగజీవాలపై దాడి చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Hyderabad: మాదాపూర్‌లో అక్రమ సరోగసీ రాకెట్‌ భయంకర నిజాలు..!

ఆసుపత్రులలో బాధితుల రద్దీ

రాజాం నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో రోజురోజుకూ కుక్కకాటు కేసులు పెరుగుతున్నాయి. రాజాం ప్రాంతీయాసుపత్రికి రోజూ 15 నుంచి 20 కేసులు వస్తున్నాయని సూపరింటెండెంట్ కరణం హరిబాబు తెలిపారు. ప్రతి నెలా 10 నుంచి 30 మంది వరకు బాధితులు ప్రభుత్వ దవాఖానలకు వస్తున్నారని ఆయన వెల్లడించారు.

మాంసం దుకాణాల వద్ద ఎక్కువ బెడద

ప్రత్యేకంగా చికెన్, మటన్ షాపుల దగ్గర వీధి కుక్కల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఎప్పుడెప్పుడు దాడి చేస్తాయోనని బిక్కుబిక్కుమంటున్నారు. ఈ పరిస్థితిని తక్షణమే అదుపులోకి తీసుకురావాలని, వీధి కుక్కల కట్టడికి అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *