Puri Jagannadha Temple: ఒడిశా రాష్ట్రం పూరీలోని ప్రముఖ జగన్నాథ ఆలయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఎంతో . ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.గోపురంపై ఉన్న జెండాను గద్ద తన నోట కరిచి ఆలయం చుట్టూ చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత సముద్రంవైపు వెళ్లిపోయింది. ఇది చూసిన భక్తులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కొందరు ఆ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే, ఈ ఘటనపై ఆలయ అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటనా జారీ చేయలేదు.
Puri Jagannadha Temple: కాగా, పూరీకి వచ్చే భక్తులంతా తొలుత పతితపావన జెండా దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత ఆలయంలో జగన్నాథుడి దర్శనం కోసం వెళ్తారు. ఆలయ శిఖరంపై ఎగురవేసే 14 మూరల పతాకం ఈ పతాకాన్ని అర్చకులు ప్రతిరోజూ మారుస్తారు. సాయంత్రం 5 గంటలకు కొత్త జెండా ఎగురవేస్తారు. భక్తులు సమర్పించే జెండాలను చక్రం దిగువన కడతారు.
