Guinness World Records: శిశువు పుట్టే సాధారణ గర్భధారణ కాలం 38 నుంచి 40 వారాల మధ్యగా ఉంటుంది. కానీ కొందరు పిల్లలు 32–37 వారాల మధ్య పుడుతారు. వీరిని “ప్రీమెచ్యూర్ బేబీలు” అంటారు. ఇక 28 వారాలకు ముందే పుట్టిన శిశువులు “ఎక్స్ట్రీమ్ ప్రీమెచ్యూర్ బేబీలు” కిందకు వస్తారు. ఇలాంటి శిశువులకు బతకడం గొప్ప సవాలే! కానీ అమెరికాలోని ఐోవా రాష్ట్రానికి చెందిన ఓ చిన్నారి మాత్రం ఈ కఠినతర పరిస్థితుల్ని జయించి గిన్నిస్ వరల్డ్ రికార్డుని సొంతం చేసుకున్నాడు.
నాష్ కీన్ కథ – 21 వారాల శిశువు బతికి బట్టకట్టిన చరిత్ర!
Guinness World Records: జూలై 5, 2024న, ఐోవా నగరంలో మోలీ మరియు రాండాల్ కీన్ దంపతులకు పుట్టిన నాష్ కీన్ అనే శిశువు కేవలం 21 వారాలు 1 రోజు గర్భధారణ అనంతరం జన్మించాడు. ఇది సాధారణ ప్రసవ తేదీకి 133 రోజులు ముందే, అంటే దాదాపు 19 వారాల ముందే. జన్మించే సమయంలో నాష్ బరువు కేవలం 10 ఔన్సులు (సుమారు 280 గ్రాములు) మాత్రమే. చెప్పాలంటే… ద్రాక్షపండు పరిమాణంలో ఉన్న ఈ బిడ్డకు జీవితం ప్రశ్నార్థకంగా మారింది.
ఇది కూడా చదవండి: PM Modi: తమిళనాడులో రెండో రోజు ప్రధాని మోదీ పర్యటన.. గంగైకొండ చోళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు
చిన్నారి కోసం బలమైన పోరాటం
Guinness World Records: ఈ చిన్నారి, “పొటాటో బేబీ”గా ప్రాచుర్యం పొందాడు. ఐోవా చిల్డ్రన్స్ హాస్పిటల్లోని **నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU)**లో ఆరు నెలల పాటు నాష్కి అత్యధిక శ్రద్ధతో చికిత్స అందించారు. రోజూ మానిటర్లు, ఆక్సిజన్ పిపాయిలు, వైర్లు మధ్య అతడి జీవితం సాగింది.
2025 జనవరిలో చివరికి డిశ్చార్జ్ చేసిన వైద్యులు అతడిని ఇంటికి పంపారు. అప్పటి నుంచి నాష్ ప్రతి నెల ప్రత్యేక వైద్య డే కేర్కు వెళ్లి చికిత్స తీసుకుంటూ, చిన్నపాటి ఆరోగ్య సవాళ్లతో పోరాడుతూ, తల్లిదండ్రుల ఆశాజ్యోతి గా మారాడు.
తల్లి భావోద్వేగం – ఆశల కథ
Guinness World Records: నాష్ తల్లి మోలీ తెలిపినట్టు, 20వ వారంలో జరిగిన ప్రినేటల్ చెకప్ అనంతరం తక్షణ డెలివరీ తప్పనిసరి అయ్యిందని, ఆ రోజు వారి జీవితంలోనే అత్యంత భయంకరమైన రోజుగా మిగిలిపోయిందట. “అతడు బతుకుతాడో లేదో అన్న విషయం అర్థం కాని పరిస్థితిలో వైద్యులు చూపిన పట్టుదలతో ఇప్పుడు మా బిడ్డ మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్నాడు” అని ఆమె ఆనందం వ్యక్తం చేసింది.
గిన్నిస్ రికార్డుతో మరో మైలురాయి
Guinness World Records: 2020లో అమెరికాలోనే అలబామాలో జన్మించిన మరో శిశువు 21 వారాల్లో పుట్టి గిన్నిస్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నాడు. అయితే నాష్ కీన్ ఆయన రికార్డును కేవలం ఒకరోజు తేడాతో బ్రేక్ చేసి కొత్త చరిత్ర సృష్టించాడు. ఈ ఘనతతో నాష్ ప్రపంచంలోనే అత్యల్ప గర్భధారణ కాలంలో పుట్టి బతికిన శిశువుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చేరిపోయాడు.
వైద్య విజ్ఞానం, తల్లిదండ్రుల నమ్మకం, వైద్యుల సేవా ధృక్పథం కలిస్తే అసాధ్యం కూడా సాధ్యం అవుతుందనడానికి నాష్ జీవితం ఒక ఉత్తమ ఉదాహరణ. అతడి ప్రాణాపాయం ఓ చరిత్రగా, పోరాటం ఓ గర్వకారణంగా మారింది. ప్రతి శ్వాసకూ విలువ తెలిసిన జీవితం ఇప్పుడు ప్రపంచానికి ఒక ప్రేరణ కథగా నిలుస్తోంది.
