Nitish Kumar Reddy: భారత యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అనూహ్యంగా లీగల్ చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఇటీవలే గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్న ఆయనకు, తన మాజీ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ఏజెన్సీ స్క్వేర్ ది వన్ రూ.5 కోట్ల బకాయిలు చెల్లించలేదన్న ఆరోపణలతో నోటీసు జారీ చేసింది. ఈ వివాదం ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో విచారణకు వెళ్లింది. జూలై 28న ఈ కేసుపై తీర్పు వచ్చే అవకాశం ఉంది.
Nitish Kumar Reddy: 2021 నుండి 2024 వరకు నితీష్‌కు బ్రాండ్ ప్రమోషన్, స్పాన్సర్‌షిప్‌లు తెచ్చేందుకు తాము కీలకంగా పనిచేశామని స్క్వేర్ ది వన్ సంస్థ వాదిస్తోంది. నితీష్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందకముందే తమ మార్గదర్శకతతోనే అతని ప్రొఫైల్‌ను మలిచామంటూ, అతను ఏజెన్సీకి చెందిన ఒప్పందాన్ని ఉల్లంఘించి మరో మేనేజర్‌తో ఒప్పందం చేసుకున్నాడని ఆ సంస్థ ఆరోపించింది.
ఇది కూడా చదవండి: PM Modi: తమిళనాడులో రెండో రోజు ప్రధాని మోదీ పర్యటన.. గంగైకొండ చోళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు
Nitish Kumar Reddy: ఈ వివాదానికి ఆర్థిక ద్రుక్పథమే మూలంగా నిలిచింది. సంస్థ తమకుండాల్సిన బకాయిలు చెల్లించాలంటూ నితీష్‌కి లీగల్ నోటీసు ఇచ్చింది. నితీష్ అయితే, తాను స్వయంగా బ్రాండ్ డీల్స్‌ను సంపాదించానని చెబుతున్నాడు. దీనిపై స్పష్టం చేయడానికి ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ చట్టం కింద సెక్షన్ 11(6) ప్రకారం హైకోర్టును ఆశ్రయించారు.
Nitish Kumar Reddy: ఇప్పటికే గాయం నుంచి కోలుకుంటున్న నితీష్‌కి ఈ లీగల్ సమస్యలు మరింత బాధ కలిగిస్తున్నాయి. ఆటపట్ల దృష్టి సారించాల్సిన సమయంలో, కోర్టు వ్యవహారాల్లో ఇరుక్కొనడం అతని కెరీర్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Nitish Kumar Reddy: నితీష్ బాటింగ్ టాలెంట్‌కి కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వంటి ప్రముఖులు ప్రశంసలు గుప్పించిన నేపథ్యంలో, ఈ లీగల్ సమస్యలు త్వరగా పరిష్కారమవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
