Donald Trump: ప్రపంచ సినిమాలపై ట్రంప్ దెబ్బ!

Donald Trump

Donald Trump: ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశాల్లో నిర్మించిన సినిమాలపై 100 శాతం సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. వాణిజ్య శాఖ, యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్‌లు తక్షణమే దీనిని ప్రారంభించాలని ఆదేశించారు. హాలీవుడ్‌ను గట్టెక్కించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

Donald Trump: ఈ మేరకు అధికారులు అమెరికాలో తమ దేశం వెలుపల నిర్మించిన సినిమాలపై 100% పన్ను విధిస్తారని తెలిపారు. ఇతర దేశాలు అమెరికన్ స్టూడియోలు, చిత్రనిర్మాతలను విదేశాలకు ఆకర్షించి, లాభదాయకమైన ప్రోత్సాహకాలను అందిస్తున్నాయని విమర్శించారు. ఈ పరిస్థితి తమ ఆర్థిక, జాతీయ భద్రతకు ముప్పుగా పేర్కొన్నారు. ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికన్ చిత్ర పరిశ్రమను పునరుద్ధరించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ చెప్పారు. వాణిజ్య శాఖ, యుఎస్ వాణిజ్య ప్రతినిధి (యుఎస్టిఆర్) అమెరికా వెలుపల నిర్మించిన అన్ని చిత్రాలపై 100 శాతం సుంకాలు విధించే ప్రక్రియను ప్రారంభించాలని ఆయన కోరారు.

Donald Trump: ‘అమెరికన్ చిత్ర పరిశ్రమ వేగంగా నాశనం అవుతోంది. ఇతర దేశాల సమిష్టి ప్లాన్ వల్ల మా జాతీయ భద్రతకు ముప్పు ఉందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దేశీయ చిత్ర నిర్మాణంలోకి తిరిగి రావాల్సిన అవసరాన్ని ట్రంప్ నొక్కి చెప్పారు. అమెరికాలో మళ్ళీ సినిమాలు తీసే పరిస్థితి రావాలని మేము కోరుకుంటున్నాం అన్నారు. కొత్త సుంకాలు అమెరికన్ గడ్డపై స్టూడియోలు తమ కార్యకలాపాలను కొనసాగించడానికి ప్రోత్సాహం అందిస్తాయన్నారు.

Donald Trump: ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం అమెరికాలో సినిమాల నిర్మాణం నిరంతరం తగ్గుతోంది. 2021 తో పోలిస్తే 2023 నాటికి అమెరికాలో సినిమా నిర్మాణం 26% తగ్గినదని అంచనా. దీని కారణంగా, హాలీవుడ్‌కు ప్రసిద్ధి చెందిన లాస్ ఏంజిల్స్ నగరంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మోషన్ పిక్చర్ అసోసియేషన్ ప్రకారం, 2023లో, అమెరికన్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా కేవలం $22.6 బిలియన్లు మాత్రమే సంపాదించాయి.

Donald Trump: హాలీవుడ్‌ను గతంలో కంటే పెద్దదిగా, మెరుగ్గా – బలంగా మా ర్చాలనుకుంటున్నానని ట్రంప్ గతంలో చాలాసార్లు అన్నారు. దీనికోసం ఆయన మెల్ గిబ్సన్, జాన్ వోయిట్, సిల్వెస్టర్ స్టాలోన్ వంటి నటులను ప్రత్యేక రాయబారులుగా కూడా నియమించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజాగా నూరు శాతం పన్నులు విధిస్తూ ప్రకటన చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *