MLA Bribe: లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయిన ఎమ్మెల్యే

MLA Bribe

MLA Bribe: మన దేశంలో లంచం తీసుకోవడం.. ఇవ్వడం కూడా చాలా మామూలు విషయంలా మారిపోయింది. లంచగొండులకు కళ్లెం వేయాల్సిన వ్యవస్థలు కూడా లంచాల మంచాలు ఎక్కిస్తున్న పరిస్థితి ఉంది. తాజాగా ఒక ఎమ్మెల్యే భారీగా లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా రెడ్ హ్యాండెడ్ గా బుక్కయిపోయాడు. ఆ స్టోరీ ఏమిటో.. ఆ లంచావతారం కథేమిటో తెలుసుకుందాం రండి. 

MLA Bribe: రాజస్థాన్‌లో భారత్ ఆదివాసీ పార్టీ కి చెందిన  బాగిడోరా నియోజకవర్గ  ఎమ్మెల్యే జైకృష్ణ పటేల్‌ను లంచం తీసుకుంటుండగా ఏసీబీ రాజస్థాన్ రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేసింది. రాజస్థాన్‌లో లంచం తీసుకుంటూ ఒక ఎమ్మెల్యే అరెస్టు కావడం ఇదే తొలిసారి. ఈ ఎమ్మెల్యే అసెంబ్లీలో మైనింగ్ శాఖకు సంబంధించిన ప్రశ్న లేవనెత్తాడు. దానిని విత్ డ్రా చేసుకోవడానికి పది కోట్ల లంచం అడిగాడు. మొత్తం మీద బేరాలు ఆడి రెండున్నర కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దానికి అడ్వాన్స్ గా 20 లక్షలు తీసుకుంటుండగా ఈ ఎమ్మెల్యేను ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. 

MLA Bribe: ఈ విషయంపై ఏసీబీ డీజీ రవిప్రకాష్ మెహరామాట్లాడుతూ ఎమ్మెల్యే లంచం తీసుకుంటుండగా  రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని  తెలిపారు. అతను చేతులు కడుక్కున్నప్పుడు, అవి రంగుతో తడిసిపోయాయి. ఎమ్మెల్యే డబ్బును ముట్టుకున్నాడు, అతను డబ్బు తీసుకున్నట్లు మా దగ్గర వీడియో ఆధారాలు ఉన్నాయి అని ఆయన చెప్పారు. 

MLA Bribe: ఎమ్మెల్యేపై చర్య తీసుకునే ముందు అసెంబ్లీ స్పీకర్‌కు సమాచారం అందించామని రవిప్రకాష్ మెహరాదా తెలిపారు. స్పీకర్ కు మొత్తం విషయం గురించి వివరించడం జరిగింది. అలాగే ఈ చర్య గురించి హోమ్ శాఖ కూడా చూస్తున్న ముఖ్యమంత్రికి కూడా సమాచారం అందించినట్లు రవిప్రకాష్ చెప్పారు. కాగా జైకృష్ణ పటేల్ 2024లో బాగిడోరా నుంచి BAP టికెట్‌పై అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన బిజెపి అభ్యర్థి సుభాష్ తంబోలియాను ఓడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *