Mock Drills: 1971లో జరిగింది.. మళ్లీ ఇప్పుడు..మాక్ డ్రిల్ ఎలా చేస్తారో తెలుసా?

mock drill

Mock Drills:  మాక్ డ్రిల్ అంటే ఏమిటి? ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? అందరికీ నమస్కారం.. ఇప్పుడు మాక్ డ్రిల్ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల మధ్య.. భారత ప్రభుత్వం మే 7వ తేదీన మాక్ డ్రిల్ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలను కోరింది. మాక్ డ్రిల్ అనేది తరచుగా వరదలకు గురయ్యే ప్రాంతాల్లోని వారికి కొంతవరకూ తెలిసిన విషయమే. ఏదైనా ఉపద్రవం వస్తే ఎలా మనల్ని మనం రక్షించుకోవాలి.. మనల్ని రక్షించడం కోసం ఉన్న వ్యవస్థలు  ఎంత సన్నద్ధంగా ఉన్నాయి.. ఆ వ్యవస్ధలకు మనం ఎలా సహకరించాలి అనేటటువంటి విషయాలను మాక్ డ్రిల్ లో తెలుసుకోవచ్చు. 

Mock Drills:  ఒకరకంగా చెప్పాలంటే ఉపద్రవం వస్తే తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తల గురించి తెలియచెప్పేదే మాక్ డ్రిల్ అని చెప్పవచ్చు. విపత్కర పరిస్థితులు అంటే తుపానులు, అగ్ని ప్రమాదాలు, వరదలు, భూకంపాలు వంటి వాటి కోసం నిర్వహించే మాక్ డ్రిల్ మనలో చాలామందికి తెలుసు. కానీ, యుద్ధ మేఘాలు ఆవరించి ఉన్న పరిస్థితుల్లో మాక్ డ్రిల్ ఎలా నిర్వహిస్తారు? ఈ విషయంపై చాలా మందికి అవగాహన లేదు. 

Mock Drills:  ఎందుకంటే, మన దేశంలో ఎప్పుడో 1971లో పాకిస్తాన్ తో యుద్ధం జరిగింది. అప్పుడు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. మళ్లీ ఇప్పుడు అదేవిధంగా మాక్ డ్రిల్ నిర్వహించడానికి సమాయత్తం అవుతున్నారు. అసలు మే ఏడవ తేదీన నిర్వహించబోయే మాక్ డ్రిల్ ఎలా ఉండొచ్చు.. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇది జరుగుతుందా వంటి ప్రశ్నలు ఇప్పటికే మీ మనసులో మెదులుతూ ఉంటాయి కదా. 

Mock Drills:  ఆ సందేహాలకు కొంతవరకూ సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో చివరి వరకూ చూడండి. నచ్చితే లైక్ చేయండి. షేర్ చేయండి. అలాగే మన న్యూస్ పల్స్ తెలుగు ఛానల్ కు సబ్ స్క్రయిబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్ళిపోదాం పదండి. 

Mock Drills:  ఈ మాక్ డ్రిల్ సమయంలో సమయంలో, వైమానిక దాడుల హెచ్చరిక సైరన్‌లు మోగుతాయి. శత్రు దాడి జరిగినప్పుడు మనల్ని మనం రక్షించుకోవడానికి పౌర రక్షణలో శిక్షణ ఇస్తారు. అంతేకాకుండా అకస్మాత్తుగా బాంబు పడినట్టు సీన్ క్రియేట్ చేసి ఆ సమయంలో ఎలా వ్యవహరించాలో చెబుతారు. అదే సమయంలో నిజంగా అక్కడ ఎదో ఒక  ప్రమాదాన్ని సృష్టించి దాని నుంచి ప్రజలు తప్పించుకోవడం ఎలానో చూపిస్తారు. 

Mock Drills:  మన దేశంలోని ప్రతి ఊరిలో ఈ మాక్ డ్రిల్ నిర్వహించరు. ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం, ఛత్తీస్‌గఢ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, గోవాతో సహా 33 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో 250 కి పైగా ప్రదేశాలలో ఈ మాక్ డ్రిల్స్ నినిర్వహిస్తారు. ఈ మాక్ డ్రిల్ కోసం పౌర రక్షణ జిల్లాలను వాటి సున్నితత్వం ఆధారంగా 3 వర్గాలుగా విభజించారు. కేటగిరీ-1 అత్యంత సున్నితమైనది.  కేటగిరీ-3 తక్కువ సున్నితమైనది. 

మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైద్రాబాద్, విశాఖపట్నం కేటగిరీ 2 లో ఉన్నాయి. 

 అసలు మాక్ డ్రిల్స్ ఎందుకు నిర్వహిస్తారో తెలుసుకుందాం.. 

  • వైమానిక దాడి హెచ్చరిక వ్యవస్థల ప్రభావాన్ని అంచనా వేయడానికి.
  • భారత వైమానిక దళంతో హాట్‌లైన్/రేడియో కమ్యూనికేషన్ లింక్‌ల నిర్వహణ.
  • కంట్రోల్ రూములు – షాడో కంట్రోల్ రూముల పనితీరును పరీక్షించడానికి.
  • శత్రు దాడి జరిగినప్పుడు తమను తాము రక్షించుకోవడానికి పౌర రక్షణ అంశాలపై పౌరులు, విద్యార్థులు మొదలైన వారికి శిక్షణ ఇవ్వడానికి.. 
  • క్రాష్ బ్లాక్ అవుట్ చర్యలు అంటే ఒక్కసారిగా వచ్చిన ప్రమాదం నుంచి బయటపడే విధానాలు చెప్పడం కిశోరం.. 
  • కీలకమైన ప్లాంట్స్, కంపెనీలు వంటి వాటిని ముందుగా అప్రమత్తం చేయడానికి..  
  • వార్డెన్ సేవలు, అగ్నిమాపక, రెస్క్యూ ఆపరేషన్లు, డిపోల నిర్వహణతో సహా పౌర రక్షణ సేవల పని తీరు వాటి రియాక్షన్స్ ఎలా ఉన్నాయో పరిశీలించడానికి  
  • ప్రజలను తరలించడానికి ప్లానింగ్ ను పరిశీలించడం.. వాటిని అమలు ఎలా చేయవచ్చనే అంచనా వేయడం కోసం ఈ మాక్ డ్రిల్ లు నిర్వహిస్తారు. 

మరి ఈ సమయంలో మనం ఏమి చేయాలి? తెలుసుకుందాం.. 

Mock Drills:  హోం మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం, వైమానిక దాడుల సైరన్లు.. బ్లాక్అవుట్ పరిస్థితులకు ఎలా స్పందించాలనే దానిపై ఈ డ్రిల్స్ దృష్టి సారిస్తాయి. అదనపు అత్యవసర సామాగ్రి, టార్చ్ లైట్లు,  కొవ్వొత్తులతో కూడిన మెడికల్ కిట్లను ఇంట్లో ఉంచుకోవాలని ప్రజలకు సూచిస్తారు. ఆ సూచనలు అమలు చేయాలి. అదేవిధంగా మాక్ డ్రిల్ సమయంలో చెప్పిన విషయాలను జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి.

Mock Drills:  ఉదాహరణకు ఒక బాంబు పడితే ఎలా రియాక్ట్ కావాలి? పక్కన బాధితులకు ఎలా సహకరించాలి.. అక్కడి సైన్య సిబ్బందికి ఎలా సహకారాన్ని అందించాలి వంటి విషయాలను జాగ్రత్తగా మాక్ డ్రిల్స్ లో తెలుసుకుని వాటిని విపత్కర పరిస్థితుల్లో అమలు చేయాలి. ఈ మాక్ డ్రిల్స్ ను ఫాలో అవడం వలన విపత్కర పరిస్థితుల్లో ప్రజలు సంయమనం కోల్పోకుండా ఉంటారు. కొంత ధైర్యంగా వాటిని ఎదుర్కోవడానికి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *