Target BRS: తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడికి లోనవుతోంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ దాడులు ముమ్మరం చేయగా, మరోవైపు బీజేపీ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన వ్యూహాలను అమలు చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కమిషన్, గొర్రెల పంపిణీ కేసులతో బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ క్రమంగా పార్టీపై నెగిటివ్ ఇమేజ్ ఏర్పరుస్తోంది.
Target BRS: కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన కమిషన్ రిపోర్ట్ ద్వారా బీఆర్ఎస్కి మరో పెద్ద దెబ్బ తగిలింది. ఈ రిపోర్ట్లో మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు వంటి కీలక నేతల పేర్లు ప్రస్తావించడంతో బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. పార్టీ వర్గాలు ఈ రిపోర్ట్ను కాంగ్రెస్ కుట్రగా అభివర్ణిస్తున్నాయి. కేసీఆర్ స్వయంగా ఈ నివేదికను “కమిషన్ రిపోర్ట్ కాదు, కాంగ్రెస్ రిపోర్ట్” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
ఇది కూడా చదవండి: AP Government: ఏపీ ప్రజలకు బంగారంలాంటి వార్త.. మీరు కూడా పాలుపంచుకోండి!
Target BRS: ఇదే సమయంలో, బీజేపీ కూడా తన వ్యూహాల్ని అమలు చేస్తూ బీఆర్ఎస్ లాయలిస్టులపై దృష్టి సారించింది. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో గులాబీ నేతలను తమ వైపు లాగేందుకు ప్రయత్నాలు కొనసాగుతోంది. ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లాకు చెందిన గువ్వల బాలరాజు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇంకా పలువురు బీఆర్ఎస్ నేతలు బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
Target BRS: ఈ డబుల్ ఎటాక్ కారణంగా బీఆర్ఎస్ పార్టీ లోపల అస్థిరత మొదలైంది. ప్రత్యర్థుల దాడుల నేపథ్యంలో, బీఆర్ఎస్ తమ పక్షాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. కమిషన్ రిపోర్టుపై హరీష్ రావు ప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధమవుతుండగా, పార్టీ ఇతర నాయకులు కూడా మీడియా ముందు వస్తున్నారు.
అయితే ఈ రాజకీయ రచ్చలో బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ స్ధానం ప్రజల్లోకి బలంగా వెళ్లడం లేదు. ప్రస్తుత దాడుల కారణంగా బీసీలకు సంబంధించిన అసలు అంశాన్ని బీఆర్ఎస్ ఫోకస్ చేయలేకపోతోంది. దీంతో పార్టీ పరువు కాపాడుకోవడమే కాకుండా, జాతీయ రాజకీయాల్లో కూడా తమ స్థానం నిలబెట్టుకోవాలన్న కఠినమైన సవాల్ బీఆర్ఎస్ ముందు నిలబడి ఉంది.
