Bharat-Pak: భారత్‌పై ఉగ్రవాద దాడులు కొనసాగిస్తున్న పాకిస్తాన్‌పై మరోసారి నిషేధం గుద్దింది భారత్. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత ప్రభుత్వం “ఆపరేషన్ సింధూర్” కింద పాకిస్తాన్‌కు సింధూ నదీ జలాల సరఫరాను నిలిపివేసింది. ఈ నిర్ణయం పాక్‌లో నీటి కొరతను పెంచి, వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
Bharat-Pak: సింధూ జలాల ఒప్పందం 1960లో భారత్–పాక్ మధ్య కుదిరింది. ఉగ్రవాద దాడుల నేపథ్యంలో దీని అమలును నిలిపివేయడం వల్ల పాక్ జలాశయాలు ఎండిపోతున్నాయి. సింధు బేసిన్లో నీటి ప్రవాహం గతేడాదితో పోలిస్తే 15% తగ్గింది. దీంతో పాకిస్తాన్లో పంటలు ఎండిపోతూ, రైతులు కష్టాల్లో మునిగిపోయారు. భారత్ నిర్ణయంతో 21% నీటి కొరత వస్తుందని పాక్ అంచనా వేసింది.
ఇది కూడా చదవండి: Dharmasthala: ధర్మస్థల తవ్వకాల్లో మలుపు.. 13వ సైట్లో జీపీఆర్తో సెర్చ్ ఆపరేషన్
ఒకవైపు పాకిస్తాన్ సైన్యాధిపతి అసీం మునీర్ అణ్వాయుధాలు, యుద్ధం అంటూ బెదిరిస్తే, మరోవైపు మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో సింధూ జలాల సరఫరా నిలిపితే యుద్ధం తప్పదంటూ ప్రగల్భాలు పలికాడు. అయితే ఇదే సమయంలో పాక్ విదేశాంగ శాఖ, నీటిని తిరిగి విడుదల చేయాలని భారత్‌ను అభ్యర్థించడం విరుద్ధమైన సంకేతమని నిపుణులు అంటున్నారు.
భారత్ మాత్రం తన వైఖరిని స్పష్టంగా చెప్పింది – పాకిస్తాన్ ఉగ్రవాదంపై తన వైఖరి మార్చకపోతే సింధూ జలాల ఒప్పందం పునరుద్ధరణ ఉండదని తేల్చిచెప్పింది. “ఉగ్రవాదం ఇంకా శాంతి ఒకే సారంగా ఉండలేవు” అని భారత్ స్పష్టంగా సందేశం పంపింది.
