Viral News: ఏం ఐడియా ఫ్రెండ్స్‌..! రైతు బర్త్ డే గిఫ్ట్‌గా ఏమిచ్చారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Viral News: సాధారణంగా బర్త్‌డే అంటే కేక్‌ కట్టింగ్‌, కేక్‌ను ముఖానికి రాసుకోవడం, స్నేహితులు సరదాగా ఇచ్చే బహుమతులు – ఇవన్నీ సహజం. కానీ, తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ రైతు బర్త్‌డే మాత్రం అందరి దృష్టిని ఆకర్షించేలా జరిగింది. ఎందుకంటే అతని స్నేహితులు ఇచ్చిన గిఫ్ట్‌ చాలా ప్రత్యేకం.

Viral News: శాత్రాజుపల్లి గ్రామానికి చెందిన మారు కిషన్ రెడ్డి 50వ పుట్టినరోజు సందర్భంగా అతని స్నేహితులు ఊహించని రీతిలో యూరియా బస్తాను బహుమతిగా అందజేశారు. ఈ వేడుకలో పాల్గొన్న వారంతా ఆ వినూత్న ఆలోచనను మెచ్చుకున్నారు. ప్రస్తుతం యూరియా కొరత రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న విషయం తెలిసిందే. ఈ సమస్యను అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశ్యంతోనే కిషన్ రెడ్డి మిత్రులు బహుమతిగా యూరియా బస్తా ఇచ్చారు.

స్నేహితుల ప్రకారం, అధికారులు ఒక్కొక్కరికీ ఒక్క బస్తా మాత్రమే ఇస్తుండటంతో రైతులు కష్టాలు పడుతున్నారు. కాబట్టి ఒక అదనపు బస్తా బర్త్‌డే గిఫ్ట్‌గా ఇవ్వడం ద్వారా మిత్రునికి నిజమైన సహాయం చేసినట్టే అవుతుందని వారు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక గిఫ్ట్‌తో బర్త్‌డే వేడుక మరింత అర్థవంతంగా మారింది.

వేడుకలో మొదట యూరియా బస్తా అందజేసి, తర్వాత కేక్‌ కట్ చేశారు. స్థానికులు కూడా ఈ వినూత్న బర్త్‌డే వేడుకను ఆసక్తిగా వీక్షించారు. రైతు సమస్యలను గుర్తు చేస్తూ స్నేహితులు తీసుకున్న ఈ సృజనాత్మక నిర్ణయాన్ని సోషల్ మీడియా వినియోగదారులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *