School Holidays: భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం 10 జిల్లాల్లో పాఠశాలలు బంద్‌!

alluarjun

School Holidays: దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో రెండు రోజుల కిందట కురిసిన వర్షాలు నిలకడగా మారగా, రాజస్థాన్‌లో మాత్రం రుతుపవనాలు తీవ్ర బీభత్సం సృష్టిస్తున్నాయి. గత 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలతో అనేక జిల్లాల్లో వరదల వంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కోట, బుండి, బరాన్, ఝలావర్, టోంక్, చిత్తోర్‌గఢ్, సవాయి మాధోపూర్ వంటి జిల్లాలు తీవ్ర ప్రభావానికి లోనయ్యాయి.

School Holidays: వాతావరణ శాఖ అంచనా ప్రకారం రాబోయే మూడు రోజులు దక్షిణ, ఆగ్నేయ రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో ఆగస్టు 22 నుండి 29 మధ్య పశ్చిమ రాజస్థాన్‌లోని బికనీర్ డివిజన్‌లో వర్షాకాలం మరింత ఉధృతం కానుంది. దీనితో రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర చర్యలకు సిద్ధమైంది.

ప్రభుత్వ చర్యలపై ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ నేరుగా సమీక్ష చేపట్టారు. టోంక్, కోటా, సవాయి మాధోపూర్, బుండి, దౌసా జిల్లాల కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడి సహాయక చర్యలను సమీక్షించారు. NDRF, SDRF బృందాలను అప్రమత్తంగా ఉంచాలని ఆదేశించారు. అలాగే పంటల నష్టం, ఆస్తి నష్టంపై ప్రత్యేక గిర్దావారీ చేపట్టి రైతులకు, ప్రజలకు ఉపశమనం కల్పించనున్నట్లు తెలిపారు.

భారీ వర్షాల ప్రభావం దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సవాయి మాధోపూర్, టోంక్, కోట, బరాన్, బుండి, ఝలావర్, భిల్వారా, చిత్తోర్‌గఢ్, దుంగార్‌పూర్, బన్స్వారా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు ఈరోజు సెలవు ప్రకటించింది. ఆదేశాలను అతిక్రమించిన పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని జిల్లా యంత్రాంగం హెచ్చరించింది.

ప్రస్తుతం ఒక్కరోజు మాత్రమే సెలవు ప్రకటించినా, వర్షాలు ఇలాగే కొనసాగితే మరిన్ని రోజులు విద్యాసంస్థలను మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందని అధికారులు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వరదప్రాంతాల్లో అనవసర రాకపోకలు చేయవద్దని ప్రభుత్వం సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *