Kavitha Suspension: భారత్ రాష్ట్ర సమితి (BRS)లో మరోసారి సంచలన పరిణామం చోటు చేసుకుంది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు అధికారిక ప్రకటన విడుదల అయింది.
Kavitha Suspension: ఇటీవల కాలంలో కవిత ప్రవర్తించిన తీరు, వ్యాఖ్యలు, పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని హైకమాండ్ అభిప్రాయపడింది. ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు పేర్కొంటూ, కేసీఆర్ ఆదేశాల మేరకు తక్షణం సస్పెన్షన్ అమలు చేసినట్లు పార్టీ స్పష్టంచేసింది.
డిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు తరఫున వాదించిన BRS లీగల్ అడ్వొకేట్ సోమభరత్, ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు. కవితపై వేటు విధిస్తూ జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులపై అతనే సంతకం చేశారు.
“ఇటీవల కాలంలో కవిత ప్రవర్తిస్తున్న తీరు, ఆమె కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు భారత రాష్ట్ర సమితికి నష్టం కలిగించేలా ఉన్నాయి. అధిష్ఠానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. అందుకే పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు కవితను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం” అని అధికారిక లేఖలో పేర్కొంది.
కవిత సస్పెన్షన్తో BRSలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నిర్ణయం పార్టీ భవిష్యత్తు, రాష్ట్ర రాజకీయాలపై ఏ విధమైన ప్రభావం చూపనుందో అన్నది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
