Bigg Boss: బిగ్ బాస్ 9లోకి బ్రహ్మముడి సీరియల్ హాట్ బ్యూటీ!

Bigg Boss: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కోసం ప్రేక్షకుల ఆతృత రోజు రోజుకి పెరుగుతోంది. ఇప్పటికే ఎనిమిది సీజన్లతో రికార్డులు సృష్టించిన ఈ రియాలిటీ షో, సెప్టెంబర్ 7 నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. దాదాపు 105 రోజులు సాగే ఈ గేమ్ షోలో సామాన్యులకీ, సెలబ్రిటీలకీ సమాన అవకాశాలు ఇస్తున్నారని సమాచారం. ఈసారి “అగ్నిపరీక్ష” అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా కామన్ మ్యాన్ సెలక్షన్ ప్రాసెస్ జరుగుతోంది.

Bigg Boss: ఇకపోతే, ఇప్పటికే బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న వారి గురించి పలు పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో క్రేజ్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీలు హౌస్ లోకి రావడం ఖాయమని చెప్పుకుంటున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు ఓ సీరియల్ హాట్ బ్యూటీ పేరు జోరుగా వినిపిస్తోంది.

బ్రహ్మముడి సీరియల్ తో మంచి పేరు తెచ్చుకున్న షర్మిత గౌడ బిగ్ బాస్ సీజన్ 9లోకి ఎంట్రీ ఇస్తుందనే టాక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. సీరియల్‌లో రుద్రాణి పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న షర్మిత.. నెగెటివ్ రోల్‌లోనూ మంచి ఇంపాక్ట్ చూపించింది. తెరపై విలన్ లా కనిపించినా.. సోషల్ మీడియాలో మాత్రం తన గ్లామర్‌తో ఫాలోవర్లను పిచ్చెక్కిస్తుంది.

ఇకపోతే, బిగ్ బాస్ హౌస్‌లోకి ఆమె ఎంట్రీ ఇస్తుందనే వార్త బయటకు రావడంతో అభిమానులు తెగ ఎగ్జైట్ అవుతున్నారు. “షర్మిత వచ్చిందంటే హౌస్‌లో రచ్చ రచ్చే!” అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

అయితే, షర్మిత గౌడ నిజంగానే బిగ్ బాస్ సీజన్ 9లోకి వస్తుందా? లేక ఇది కేవలం ప్రచారమేనా? అన్నది సెప్టెంబర్ 7న గ్రాండ్ లాంచింగ్‌లో స్పష్టమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *