Crime News: ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మంగళగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిపై తన కొడుకు గొడ్డలితో దాడి చేయడం స్థానికులను షాక్కు గురి చేసింది. కారణం ఏమిటంటే… తండ్రి తన కొడుకుకి పల్సర్ బైక్ కొనివ్వకపోవడమే.
Crime News: ఎనిమిదో తరగతి చదివిన సతీష్ అనే యువకుడు పనిపాటా లేకుండా తిరుగుతూ తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచేవాడు. తాగుడు, పోకిరీ తిరుగుళ్లకు డబ్బులు కావాలని తరచూ అడిగి తల్లిదండ్రులను వేధించేవాడు. పలుమార్లు తగువులు పెట్టిన అతను చివరికి పల్సర్ బైక్ కొనివ్వాలని, సెల్ఫోన్ రీచార్జ్ చేయాలని పట్టుబడ్డాడు. డబ్బులు లేవని చెప్పడంతో కోపం పెంచుకున్న సతీష్, అర్ధరాత్రి సమయంలో తండ్రి నాగయ్యపై గొడ్డలితో దాడి చేశాడు.
కేకలు విన్న భార్య నాగలక్ష్మి, స్థానికులు వచ్చేసరికి సతీష్ అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన నాగయ్యను పొరుగువారు తక్షణం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై నాగలక్ష్మి రూరల్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సతీష్ కోసం గాలింపు కూడా చేపట్టారు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది.
