ICC Rankings: ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ఆల్-రౌండర్ ర్యాంకింగ్స్‌లో ఆసియా క్రికెటర్లు ఆధిపత్యం చెలాయించారు. ముఖ్యంగా అఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో టాప్-2 స్థానాలను కైవసం చేసుకోవడం విశేషం. జింబాబ్వే, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఆటగాళ్లు కూడా టాప్-5లో చోటు దక్కించుకున్నారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ జాబితాలో ఒక్క భారత ఆటగాడికీ స్థానం దక్కలేదు.
టాప్-5 ఆల్-రౌండర్లు:
- అజ్మతుల్లా ఒమర్జాయ్ (అఫ్ఘనిస్తాన్)
అఫ్ఘనిస్తాన్ యువ ఆల్-రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ 296 రేటింగ్‌తో మొదటి స్థానంలో నిలిచాడు. 2025లో లాహోర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అతను అద్భుత ప్రదర్శన చేసి, తన కెరీర్ బెస్ట్ రేటింగ్ సాధించాడు. - మహ్మద్ నబీ (అఫ్ఘనిస్తాన్)
సీనియర్ ఆల్-రౌండర్ మహ్మద్ నబీ 292 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. అఫ్ఘన్ జట్టుకు చాలా కాలంగా వెన్నెముకగా నిలిచిన నబీ, 2017లో ఐర్లాండ్‌పై 350 రేటింగ్‌తో తన కెరీర్ బెస్ట్ సాధించారు. - సికిందర్ రజా (జింబాబ్వే)
జింబాబ్వే స్టార్ ప్లేయర్ సికిందర్ రజా 290 రేటింగ్‌తో మూడో స్థానంలో నిలిచాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ స్థిరంగా రాణిస్తున్న రజా, 2024లో పాకిస్తాన్‌పై 299 రేటింగ్ నమోదు చేశాడు. - మెహదీ హసన్ మిరాజ్ (బంగ్లాదేశ్)
బంగ్లాదేశ్ ఆల్-రౌండర్ మెహదీ హసన్ మిరాజ్ 249 రేటింగ్‌తో నాలుగో స్థానంలో ఉన్నారు. 2022లో భారత్‌పై మీర్పూర్లో ఆడిన మ్యాచ్‌లో అతను 295 రేటింగ్‌తో తన కెరీర్ బెస్ట్ సాధించారు. - మైఖేల్ బ్రేస్‌వెల్ (న్యూజిలాండ్)
న్యూజిలాండ్ ఆటగాడు మైఖేల్ బ్రేస్‌వెల్ 246 రేటింగ్ పాయింట్లతో ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు. 2025లో బే ఓవల్‌లో పాకిస్తాన్‌పై అద్భుత ప్రదర్శన చేసి, కెరీర్ బెస్ట్ రేటింగ్ సాధించాడు.
ఆసియా ఆటగాళ్లు ర్యాంకింగ్స్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ, భారత ఆటగాళ్లకు టాప్-5లో చోటు దక్కకపోవడం అభిమానులకు నిరాశ కలిగిస్తోంది.
