Venkatesh: వెంకటేష్, సరసన ఆ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా ఫిక్స్!

Venkatesh: సంక్రాంతి బ్లాక్‌బస్టర్ “వస్తున్నాం” తర్వాత వెంకటేష్ మార్కెట్ హై పీక్స్‌లో కొనసాగుతోంది. 300 కోట్ల మార్క్‌ను దాటిన విజయంతో ఆయన తర్వాతి సినిమా ఏంటన్నది అభిమానుల్లో పెద్ద ఆసక్తిని రేపింది. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో వెంకీ మామ జోడీ కుదిరింది.

Venkatesh: త్రివిక్రమ్ చివరిగా మహేష్ బాబుతో “గుంటూరు కారం” చేసిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో వచ్చినా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో త్రివిక్రమ్ నెక్ట్స్ హీరో ఎవరు అన్నది హాట్ టాపిక్ అయ్యింది. అల్లు అర్జున్‌తో సినిమా అనుకున్నా, ఆయన ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉండటంతో, త్రివిక్రమ్ మరో హీరోతో సినిమా ప్లాన్ చేశారు. ఆ హీరో ఎవరో కాదు.. వెంకటేష్.

గతంలో రచయితగా ఉన్నప్పుడు త్రివిక్రమ్ – వెంకీ కాంబోలో “నువ్వు నాకు నచ్చావ్”, “మల్లీశ్వరి” సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్‌లో సినిమా రాబోతోంది. ఇటీవలే పూజాకార్యక్రమం జరిపిన ఈ మూవీ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌లోకి వెళ్లనుంది.

ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రివిక్రమ్ తనదైన స్టైల్‌లో కామెడీ, ఫ్యామిలీ డ్రామాను మిక్స్ చేస్తున్నారని టాక్. ఇక హీరోయిన్‌గా కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టిని ఫైనల్ చేశారట. ఇటీవలే ఆమె *“హిట్ 3”*తో మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.

దీంతో వెంకటేష్ – త్రివిక్రమ్ – శ్రీనిధి శెట్టి కాంబో సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *