PM Modi: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారతదేశంపై సుంకాలు విధించారు. అయితే, కొద్ది రోజుల వ్యవధిలోనే ఆయన స్వరం మారి, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తన మంచి స్నేహితుడిగా అభివర్ణిస్తున్నారు. భారత్-అమెరికా సంబంధాలను ప్రశంసిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలకు ప్రధాని మోదీ తొలిసారి స్పందించారు.
PM Modi: మోదీ మాట్లాడుతూ, ట్రంప్ సానుకూల భావనలు తమ ద్వైపాక్షిక సంబంధాలకు బలాన్నిస్తాయని పేర్కొన్నారు. “అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావాలను, మా సంబంధాలపై ఆయన సానుకూల అంచనాను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. భారతదేశం-అమెరికా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమగ్ర, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి.” అని ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో తెలిపారు.
శుక్రవారం (సెప్టెంబర్ 5) వైట్ హౌస్లోని ఓవల్ కార్యాలయంలో ట్రంప్ మాట్లాడుతూ, “నేను ఎల్లప్పుడూ భారత ప్రధాని నరేంద్ర మోదీకి స్నేహితుడిగానే ఉంటాను. ఆయన అద్భుతమైన ప్రధానమంత్రి. కానీ ప్రస్తుతం ఆయన చేస్తున్న పని నాకు నచ్చడం లేదు. అయినప్పటికీ, భారత్-అమెరికా మధ్య ప్రత్యేక సంబంధం ఉంది, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు అలాంటి క్షణాలు వస్తాయి.” అని అన్నారు.
ఇది కూడా చదవండి: GST 3.0: కొత్త జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ఉపశమనం – ఏం మారబోతోంది?
అంతకుముందు ట్రంప్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తూ, భారత్ మరియు రష్యా చైనా ప్రభావంలోకి వెళ్లిపోయాయని వ్యాఖ్యానించారు. అదే సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ మరియు ప్రధాని మోదీ ఉన్న పాత ఫోటోను షేర్ చేశారు.
Deeply appreciate and fully reciprocate President Trump’s sentiments and positive assessment of our ties.
India and the US have a very positive and forward-looking Comprehensive and Global Strategic Partnership.@realDonaldTrump @POTUS https://t.co/4hLo9wBpeF
— Narendra Modi (@narendramodi) September 6, 2025
చైనాలో జరిగిన SCO శిఖరాగ్ర సమావేశం తర్వాత ట్రంప్ వైఖరి మారినట్లు గమనించవచ్చు. భారతదేశాన్ని కోల్పోయినందుకు ఆయన విచారం వ్యక్తం చేస్తున్నారని, కొన్ని సందర్భాల్లో ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే, అమెరికా సుంకాలపై భారత్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించకపోయినా, రష్యా నుండి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తున్నది. దీనివల్లే ట్రంప్ భారతదేశాన్ని కోల్పోతామనే భయంతో ఇప్పుడు స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
