Kerala: గర్భిణీ మహిళలకు ఏ క్షణంలోనైనా ప్రసవ నొప్పులు రావచ్చు. అందుకే వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇటీవల రైల్లో ప్రయాణిస్తున్న ఓ గర్భిణీకి అకస్మాత్తుగా నొప్పులు రావడంతో ఆర్మీ డాక్టర్ సకాలంలో సహాయం చేసి తల్లీబిడ్డలను కాపాడాడు. తాజాగా కేరళలోని అడవిలో ఇలాంటి ఘటన జరిగింది.
Kerala: మున్నార్ సమీపంలోని వల్లకడవు అటవీ ప్రాంతంలో దినసరి కూలీ సురేష్ తన భార్య బిందుతో కలిసి ఏలకులు కోయడానికి వెళ్లాడు. బిందు గర్భవతే అయినప్పటికీ ఆర్థిక పరిస్థితుల వల్ల పని చేయాల్సి వచ్చింది. అయితే, అడవిలో పనిచేస్తున్న సమయంలోనే ఆమెకు అకస్మాత్తుగా ప్రసవ నొప్పులు మొదలయ్యాయి.
ఇది కూడా చదవండి: Karnataka CM: ముడా కేసులో కర్ణాటక సీఎంకు బిగ్ రిలీఫ్.. సిద్ధరామయ్య కుటుంబానికి క్లీన్ చిట్!
ఆస్పత్రి చాలా దూరంలో ఉండటంతో, పరిస్థితి క్లిష్టంగా మారింది. భర్త సురేష్ ఏమి చేయాలో తెలియక కంగారుపడ్డాడు. వెంటనే ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. కానీ వారు చేరుకునేలోపే, బిందు అడవిలోనే తన మూడవ బిడ్డకు జన్మనిచ్చింది.
తరువాత అక్కడికి చేరుకున్న వైద్య సిబ్బంది తల్లి, శిశువును సురక్షితంగా బయటకు తీసుకువచ్చి, వండిపెరియార్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు.
ఈ సంఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. కష్టసమయంలో బిందు చూపిన ధైర్యాన్ని అందరూ అభినందిస్తున్నారు.
