Coal India: పండుగ సీజన్ ప్రారంభంలో కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) ఉద్యోగులకు సరికొత్త సంక్షేమ పథకాలు ప్రకటించింది. ఉద్యోగుల గౌరవం, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాలు ఉద్యోగ కుటుంబాలకు బలమైన ఆర్థిక భద్రతను కల్పించనున్నాయి.
Coal India: ఉద్యోగుల కోసం బీమా కవరేజ్ను భారీగా పెంచి రూ.1 కోటి వరకు పెంచారు. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే—ఉద్యోగులు ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది కుటుంబాలకు అత్యంత భద్రతను అందిస్తుంది.
శాశ్వత ఉద్యోగులకు కూడా రక్షణ మొదటిసారిగా, శాశ్వత ఉద్యోగులు కానివారికి కూడా బీమా కవర్ వర్తింపజేశారు. ఇది ఉద్యోగులందరికీ సమానంగా రక్షణ కల్పించే దిశగా తీసుకున్న చారిత్రక నిర్ణయం.
యూనిఫాం డ్రెస్ కోడ్ CIL దాని అనుబంధ సంస్థలలో, CMD నుండి కార్మికుడి వరకు ఒకే విధమైన యూనిఫాం డ్రెస్ కోడ్ అమలులోకి వస్తుంది. ఇది సమానత్వం, ఐక్యత, కోల్ పరివార్ అనే ఒక గుర్తింపును ప్రతిబింబిస్తుంది.
పెరిగిన ఎక్స్-గ్రేషియా ప్రయోజనాలు ఉద్యోగుల కోసం ఎక్స్-గ్రేషియా పరిహారం రూ.15 లక్షల నుండి రూ.25 లక్షలకు పెంచారు. ఇది కష్టసమయాల్లో కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యంగా ఉంది.
ఈ పథకాలను ప్రకటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ— “ఇది కేవలం ఆర్థిక బహుమతి మాత్రమే కాదు, దేశానికి ఇంధనంగా నిలిచే బొగ్గు పరివార్కు గుర్తింపు, కృతజ్ఞత, సాధికారత సందేశం” అని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వం కరుణ, పనితీరు, సంస్కరణలతో కూడిన రంగాన్ని నిర్మించడమే లక్ష్యంగా ఉందని స్పష్టం చేశారు.
“సంస్కరణ, పనితీరు, పరివర్తన అనే మంత్రం ద్వారా మార్గనిర్దేశం చేసిన భారతదేశం ఇప్పుడు ప్రపంచాన్ని వృద్ధి పట్టు నుండి బయటపడేలా సహాయపడే స్థితిలో ఉంది” అని ప్రధాని మోదీ వ్యాఖ్యలను మంత్రి కిషన్ రెడ్డి గుర్తుచేశారు.
మొత్తానికి, ఈ ప్రకటనలతో కోల్ ఇండియా ఉద్యోగులు, వారి కుటుంబాలకు మరింత ఆర్థిక రక్షణ, గౌరవం కలిగేలా మారింది.
कोल इंडिया लिमिटेड, इसकी सहायक कंपनियों और SCCL के मेरे सभी परिवारजनों को नवरात्रि की हार्दिक शुभकामनाएँ।
कोल इंडिया लिमिटेड के स्वर्ण जयंती वर्ष में मेनेजमेंट को यह घोषणा करते हुए प्रसन्नता हो रही है कि आने वाले दशहरा, दीपावली और छट पूजा आदि त्यौहारों पर CIL, इसकी सहायक… pic.twitter.com/vPxjFtw6m7
— G Kishan Reddy (@kishanreddybjp) September 26, 2025
