Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎపిసోడ్ రసవత్తరంగా, ట్విస్ట్‌లతో సాగుతోంది. గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగినట్లుగానే కొత్త కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగు పెట్టగా, మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా చోటుచేసుకుంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో చూసి బిగ్ బాస్ ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
Bigg Boss Telugu 9: హౌస్ మేట్స్ అందరూ గాఢ నిద్రలో ఉండగా, డేంజర్ సైరన్ మోగించి బిగ్ బాస్ వారిని నిద్రలేపాడు. ఈ వారం ఆరంభంలో సభ్యుల పేర్లతో సీడ్స్ ఇచ్చిన బిగ్ బాస్, అందులో రెడ్ సీడ్ వచ్చిన వారికి ఒక ప్రత్యేక పవర్ ఇచ్చారు. ఆ పవర్ ద్వారా ఇంటి నుంచి ఒక కంటెస్టెంట్‌ను బయటకు పంపించే అవకాశం కల్పించారు.
ఇది కూడా చదవండి: Bigg Boss 9: యూత్‌ను హీటేక్కిస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ!
రెడ్ సీడ్ అందుకున్న భరణి, మాస్క్ మ్యాన్ హరీశ్, పవన్ కళ్యాణ్, డిమోన్ పవన్, రాము ఎవరిని బయటకు పంపించాలో చర్చించారు. ఈ చర్చలో తోటి సభ్యులను రెచ్చగొడుతున్న కారణంగా సంజనానే ఎలిమినేట్ చేయాలని హరీశ్ స్పష్టంగా చెప్పాడు. రాము, డిమాన్ పవన్ కూడా సంజనాపై ఆరోపణలు చేస్తూ బయటకు పంపాలని బిగ్ బాస్‌కు సూచించారు.
మెజారిటీ సభ్యులు సంజనాకు ఓటేయడంతో, బిగ్ బాస్ వెంటనే మెయిన్ గేట్ నుంచి ఆమెను బయటకు వెళ్లమన్నాడు. దీంతో సంజనా కన్నీళ్లు పెట్టుకొని, తనను కార్నర్ చేసి బయటకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే హౌస్ మేట్స్ నిర్ణయాన్ని గౌరవిస్తానని చెప్పి, లగేజీ బ్యాగ్ తీసుకొని బయటకు వెళ్లడాన్ని ప్రోమోలో చూపించారు.
ఆమె వెళ్లిపోవడంతో ఇమ్మాన్యుయేల్ గుక్కపెట్టి ఏడ్చాడు. కానీ ఈ ఎలిమినేషన్ అసలైనది కాదని తెలుస్తోంది. ఇది కేవలం డ్రామా మాత్రమేనని, సంజనాను సీక్రెట్ రూమ్‌లోకి పంపించబోతున్నారని అభిమానులు భావిస్తున్నారు.
అదీకాక, ఈ వారం సంజనా అసలు నామినేషన్లలోనే లేని విషయం గమనార్హం. అలాంటప్పుడు నేరుగా ఎలిమినేట్ చేయడమేంటని బిగ్ బాస్ ఆడియెన్స్ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ ట్విస్ట్‌తో సీజన్ 9 హైలైట్ క్రియేట్ అయింది.
