Manchu Manoj: యంగ్ హీరో తేజ సజ్జా నటించిన మిరాయ్ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా కొనసాగుతోంది. కొత్త కాన్సెప్ట్, హై టెక్నికల్ స్టాండర్డ్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సెప్టెంబర్ 12న విడుదలైన తర్వాత పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మిరాయ్, తేజ సజ్జా కెరీర్లో మరో మైలురాయిగా నిలిచింది.
Manchu Manoj: చాలా రోజుల తర్వాత పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించిన మంచు మనోజ్‌కి ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచింది. ఆయన స్టైల్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేశాయి. విలన్‌గా మనోజ్ తెరపై చూపిన ఇంపాక్ట్ సినిమాకు అదనపు బలం ఇచ్చింది.
దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఫాంటసీ, మైథలాజికల్ టచ్‌తో మిరాయ్ ను కొత్తగా ప్రెజెంట్ చేశారు. ప్రతి సన్నివేశంలోనూ విజువల్స్, గ్రాఫిక్స్, బీజీఎం హై క్వాలిటీగా ఉండటంతో థియేటర్ ఎక్స్పీరియన్స్ ప్రేక్షకులను మెప్పిస్తోంది. హీరోగా తేజ సజ్జా సూపర్ హీరో క్యారెక్టర్లో ఎనర్జీతో స్క్రీన్‌ను నింపాడు. యాక్షన్‌తో పాటు ఎమోషనల్ సీన్స్‌లో కూడా అతని నటన బలంగా నిలిచింది.
సినిమా విజయానంతరం మంచు మనోజ్ తన కుటుంబంతో కలిసి సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. తల్లి పాదాలకు నమస్కారం చేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. తన విజయంలో తల్లి ఆశీస్సులు, అభిమానుల ప్రేమే కారణమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన డాన్స్ చేస్తూ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రేక్షకులు, సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. “విజువల్స్ అదుర్స్”, “థియేటర్ ఎక్స్పీరియన్స్ మైండ్ బ్లోయింగ్”, “హై టెక్నికల్ వాల్యూస్ ఉన్న సినిమా” అంటూ పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ప్రస్తుతం మిరాయ్ విజయవంతంగా థియేటర్లలో దూసుకెళ్తోంది.
My mom was the proudest 🙏🏼❤️ Thank u all for making this happen ♥️ Celebrating it with my dearest ones around me makes it even more memorable 🙌🏼
My heartfelt thanks to each and every movie lover for the immense love 🙏🏻#Mirai #BlackSword pic.twitter.com/eJYQIWr7MU
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 12, 2025
