Sunitha Daughter: ప్రముఖ గాయని సునీత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన మధురమైన గాత్రంతో మిలియన్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సునీత, సింగర్ మాత్రమే కాదు, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. పలువురు స్టార్ హీరోయిన్లకు ఆమె తన స్వరంతో జీవం పోశారు. అనేక అవార్డులు, రివార్డులు అందుకున్న సునీత, ప్రస్తుతం పలు సింగింగ్ షోలకు జడ్జ్గా వ్యవహరిస్తున్నారు.
Sunitha Daughter: ఇటీవల సునీత కుటుంబంలో ఒక సంతోషకర సంఘటన చోటుచేసుకుంది. ఆమె కూతురు శ్రేయ అమెరికాలోని న్యూయార్క్ ప్రాట్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. ఈ సందర్భంగా జరిగిన గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు సునీత ఫ్యామిలీ అంతా హాజరై, శ్రేయతో కలిసి ప్రత్యేక క్షణాలను పంచుకున్నారు.
ఈ సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న సునీత భావోద్వేగానికి గురయ్యారు. “ఒకప్పుడు స్కెచ్బుక్లో బొమ్మలు గీసిన మా శ్రేయ, ఇప్పుడు ప్రాట్ ఇన్స్టిట్యూట్లో ఇల్లస్ట్రేషన్లో గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంది. తన సృజనాత్మకతతో ప్రపంచానికి పరిచయం అవ్వడానికి రెడీ అయింది. ఒక తల్లిగా నాకు గర్వంగా ఉంది” అని రాసుకొచ్చారు.
ఇక శ్రేయ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన అందంతో పాటు క్రియేటివిటీలోనూ ఆకట్టుకుంటున్న శ్రేయను చూసి అభిమానులు ఆమె హీరోయిన్గా వస్తే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఒక సినిమాలో పాట పాడిన శ్రేయ, తల్లి బాటలోనే కొనసాగుతుందా అన్న ఆసక్తి నెటిజన్లలో పెరుగుతోంది.
View this post on Instagram
సునీత కుమారుడు ఆకాష్ ఇప్పటికే సర్కారు నౌకరి అనే సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూతురు శ్రేయ ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తుండటంతో, సునీత కుటుంబం మళ్లీ హాట్ టాపిక్గా మారింది.
