Salman Ali: ఈ మాత్రం దానికే ఎగిరెగిరి పడుతున్నావ్.. నీకు దమ్ముంటే రేపు టీమిండియాను ఓడించి మాట్లాడు

Salman Ali: ఆసియా కప్ 2025లో గ్రూప్-ఎ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు ఒమన్‌పై ఘన విజయం సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 93 పరుగుల తేడాతో ఒమన్‌ను ఓడించింది. ఈ విజయంతో పాక్ జట్టు ఆత్మవిశ్వాసం పెరిగింది. అయితే, టీమిండియాపై తలపడే ముందు పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

Salman Ali: ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ప్రతిగా ఒమన్ జట్టు 16.4 ఓవర్లలో కేవలం 67 పరుగులకే ఆలౌట్ అయింది. మహ్మద్ హారిస్ 66 పరుగులు చేయగా, బౌలర్లలో ముగ్గురు స్పిన్నర్లు అద్భుత ప్రదర్శన చూపించారు.

మ్యాచ్ తర్వాత పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా మాట్లాడుతూ – “మేము నిజంగా మంచి క్రికెట్ ఆడుతున్నాం. ట్రై-సిరీస్ గెలిచాం. ఈ మ్యాచ్ కూడా సులభంగా గెలిచాం. మా ప్లాన్లను కరెక్ట్‌గా అమలు చేస్తే ఏ జట్టునైనా ఓడిస్తాం. బౌలింగ్ యూనిట్ అద్భుతంగా ఉంది. స్పిన్నర్లు గేమ్‌ను మలుపు తిప్పారు” అని అన్నారు.

ఇది కూడా చదవండి: IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు కొనడానికి అభిమానులు వెనకాడుతున్నారా? అసలు కారణం ఇదే!

అలాగే, “మేము మొదట 180 పరుగులు చేయాలని అనుకున్నాం. కానీ క్రికెట్ మనం అనుకున్నట్లే జరగదు. అయినా గెలవగలిగాం. ఈ ఫార్మ్‌లో కొనసాగితే ఇండియాతో కూడా మంచి ఫైట్ ఇస్తాం” అని స్పష్టం చేశారు.

ఈ స్టేట్‌మెంట్‌తో పాక్ అభిమానులు ఉత్సాహంగా ఉన్నప్పటికీ, భారత క్రికెట్ అభిమానులు మాత్రం – “ఒమన్‌పై గెలిచి అంతా పొగడ్తలాడకు, అసలు పరీక్ష రేపే ఉంటుంది. నీకు దమ్ముంటే టీమిండియాను ఓడించి చూపించు” అంటూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.

ఇక, సెప్టెంబర్ 14న దుబాయ్‌లో జరిగే భారత్ vs పాకిస్తాన్ గ్రూప్-ఎ మ్యాచ్‌పై ఆసక్తి కేంద్రీకృతమైంది. ఈ హై-వోల్టేజ్ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *