Telangana: తెలంగాణ-కజకిస్తాన్ మధ్య కీలక ఒప్పందం.. గవర్నర్‌తో రాయబారి భేటీ!

Telangana: భారతదేశంలోని కజకిస్తాన్ రిపబ్లిక్ రాయబారి అజామత్ యెస్కారయేవ్, హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌లో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో సమావేశమయ్యారు. ఈ భేటీలో వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్య సంరక్షణ, విద్య, పునరుత్పాదక ఇంధనం, కనెక్టివిటీ రంగాల్లో తెలంగాణ-కజకిస్తాన్ సహకారాన్ని బలోపేతం చేసే అవకాశాలపై చర్చించారు.

Telangana: సెప్టెంబర్ 18, 19 తేదీలలో హైదరాబాద్ పర్యటనలో భాగంగా రాయబారి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జూబ్లీ హిల్స్‌లోని కజకిస్తాన్ రిపబ్లిక్ గౌరవ కాన్సులేట్‌ను సందర్శించారు. నగరంలోని ప్రముఖ సంస్థలు, కార్పొరేట్ ప్రతినిధులతో ఉన్నత స్థాయి చర్చలు జరిపారు.

ఇది కూడా చదవండి: Cow Operation: తెలంగాణలో షాకింగ్ ఘటన: ఆవు కడుపులో 90 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలు..!

MSN ల్యాబ్స్‌తో కలిసి కజకిస్తాన్‌లో API తయారీ యూనిట్ ఏర్పాటు పై చర్చలు జరిగాయి. అలాగే అపోలో, KIMS, నెఫ్రోప్లస్ హాస్పిటల్స్‌తో వైద్య విద్య, ప్రత్యేక వైద్య సేవల రంగాల్లో భాగస్వామ్యం పెంపొందించే దిశగా కీలక ఒప్పందాలు కుదిరాయి.

ఇక MAK ప్రాజెక్ట్స్ ఆధ్వర్యంలోని BTR గ్రీన్స్ ప్రాజెక్టును సందర్శించిన రాయబారి, స్థిరమైన లగ్జరీ గృహ నిర్మాణం పట్ల ఆకర్షితుడయ్యారు. ఇలాంటి ప్రాజెక్టులను కజకిస్తాన్‌లో కూడా అమలు చేయడానికి ఆసక్తి చూపారు.

సాంస్కృతిక పర్యటనలో భాగంగా చార్మినార్, మక్కా మసీదు, చౌమొహల్లా ప్యాలెస్ వంటి ప్రముఖ వారసత్వ ప్రదేశాలను సందర్శించారు. హైదరాబాద్ సాంస్కృతిక వైభవం తనను ఎంతో ఆకట్టుకున్నదని రాయబారి తెలిపారు.

ఈ పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, భవిష్యత్తులో తెలంగాణతో మరింత సన్నిహిత  సంబంధాలను కొనసాగించాలని అజామత్ యెస్కారయేవ్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *