Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం బీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) శుక్రవారం మాగంటి సునీత పేరును ఖరారు చేశారు. ఇటీవల మృతిచెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను అభ్యర్థిగా బరిలోకి దింపాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.
Jubilee Hills Bypoll: మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మరణించడంతో జూబ్లీహిల్స్ స్థానంలో ఉపఎన్నిక అవసరమైంది. గోపీనాథ్ పార్టీకి సీనియర్ నేతగా, జూబ్లీహిల్స్ ప్రజల అభిమానం పొందిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన స్థానంలో కుటుంబానికి ప్రాధాన్యతనిస్తూ, సునీతను వారసురాలిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Robbery: ఇదేందిరా మావా ఏకంగా ఐపిఎస్ అధికారి ఇంట్లోనే చోరీ!
రాబోయే ఉపఎన్నికలో బీఆర్ఎస్ నుండి సునీత బరిలోకి దిగుతుండటంతో, అధికార పార్టీ ఆ నియోజకవర్గంలో విజయాన్ని సులభతరం చేసుకునే అవకాశముందని భావిస్తున్నారు. ఇక ప్రతిపక్షాలు కూడా తమ తమ అభ్యర్థుల ఎంపికపై ముమ్మరంగా వ్యూహాలు రచిస్తున్నాయి.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ ను పార్టీ అధినేత కేసీఆర్ గారు ప్రకటించారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి మరణంతో, త్వరలో జరుగనున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో.. పార్టీలో సీనియర్ నేతగా, జూబ్లీ హిల్స్ ప్రజల అభిమాన… pic.twitter.com/nYGznPYvrk
— BRS Party (@BRSparty) September 26, 2025
