Viral Video: అప్పు చెల్లించని స్నేహితుడి చితి కర్రతో కొట్టిన వ్యక్తి – వైరల్ వీడియో!

Viral Video: ఉత్తరప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామంలో అసాధారణమైన ఘటన వెలుగు చూసింది. చనిపోయిన స్నేహితుడి నుండి రూ.50,000 అప్పు తిరిగి పొందలేకపోయిన వ్యక్తి, ఆగ్రహంలో అతని చితిని శ్మశానవాటికలో కర్రతో కొట్టి ధ్వంసం చేశాడు. ఈ ఘటనా వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: వీరు ఇద్దరూ చిన్నప్పటి నుండి బాల్య స్నేహితులు, ఒకే గ్రామానికి చెందినవారు. రెండేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి స్నేహితుడి నుంచి రూ.50,000 వేలు అప్పుగా తీసుకున్నప్పటికీ తిరిగి చెల్లించకుండానే మరణించాడు. ఈ వార్త తెలిసిన వెంటనే అతని స్నేహితుడు కోపంతో శ్మశానవాటికకు చేరి, చితి కాలిపోతున్న సందర్భంలోనే చితిని కర్రతో కొట్టడం ప్రారంభించాడు.

ఇది కూడా చదవండి: Gold & Silver: దీపావళి నాటికి ధరల్లో మార్పు.. బంగారం కొంత తగ్గొచ్చే అవకాశం, వెండి నిల్వ కష్టమే!

చితికి దగ్గరలోని మృతుడి భార్య, పిల్లలు కూడా కళ్ళముందే ఈ ఘటనను చూశారు. చితిపై ఉన్న నిప్పురవ్వలు, కట్టెలు ఎగిరి చెల్లాచెదురుగా అయ్యాయి. ఘటనలో పాల్గొన్న ఒక యువకుడు ఈ సన్నివేశాన్ని వీడియో చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు, ఇది కాస్తా వైరల్ అయ్యింది. వీడియోలో ఆ వ్యక్తి, “అయ్యో, నా డబ్బు తిరిగి ఇవ్వలేదు” అని చెప్పుతూ చితిని కొడుతున్నట్లుగా కనిపిస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Maxx King (@mxv.official_)

ఈ షాకింగ్ ఘటనపై స్థానికులు, నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *