Bad Dreams: చెడు కలలు వస్తే నిజంగానే చెడు జరుగుతుందా? నిపుణుల వివరణ ఇదే!

Women Education

Bad Dreams: కలలు కనడం సహజం. ప్రతి ఒక్కరూ రోజూ ఏదో ఒక కల చూస్తారు. కొందరికి మంచి కలలు వస్తే, మరికొందరికి మాత్రం భయపెట్టే చెడు కలలు వస్తాయి. ముఖ్యంగా రాక్షసులు, ఆత్మలు, ప్రమాదాలు, మరణం వంటి సన్నివేశాలు కలలో కనబడితే చాలామంది భయంతో వణికిపోతారు. మరి నిజంగానే చెడు కలలు వస్తే చెడు జరుగుతుందా?

Bad Dreams: నిపుణుల మాటల్లో, చెడు కలలు రావడం అనేది తప్పనిసరిగా చెడు జరుగుతుందని అర్థం కాదు. కొన్ని సందర్భాల్లో ఇవి మనలోని సమస్యలను లేదా మనసులో దాగి ఉన్న భావాలను సూచించవచ్చు. ఉదాహరణకు, చనిపోయిన బంధువులు కలలో కనిపించడం అంటే వారిని మీరు మర్చిపోలేకపోతున్నారని, వారిపై మీకు ఉన్న అనురాగానికి సంకేతం.

అలాగే, మీరే చనిపోయినట్లు కలలో కనపడితే, అది మీరు జీవితంపై కొత్త దృక్పథం పొందబోతున్నారనే లేదా పాజిటివ్ థింకింగ్ పెరుగుతున్నదనే సూచన కావచ్చు. పెద్ద ప్రమాదం జరిగిందని కలలో కనపడితే, అది మీ ఆత్మగౌరవాన్ని పెంచుకోవాలని సూచించేలా ఉంటుంది. నగ్నంగా ఉన్నట్లు కల వస్తే, అది మీ భయాలు, ఆత్మవిశ్వాస లోపాన్ని తెలియజేస్తుంది.

ఇక పాములు పదే పదే కనిపించడం నెగటివ్ ఆలోచనలు మిమ్మల్ని కాపాడే ఒక సంకేతంగా పండితులు భావిస్తారు.

గమనిక: ఈ సమాచారం మతపరమైన విశ్వాసాలు, పండితుల అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకులు దీన్ని కేవలం ఆసక్తి కోసం మాత్రమే పరిగణించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *