War 2 Trailer: బాలీవుడ్ స్పై యూనివర్స్‌లో మోస్ట్ అవైటెడ్ మూవీగా నిలిచిన “వార్ 2” ఇప్పుడు మరింత హైప్‌తో దూసుకుపోతోంది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు సంబంధించి ట్రైలర్‌ను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది.
“వార్ 2” సినిమా, గతంలో భారీ విజయాన్ని సాధించిన హృతిక్ వార్ సినిమా సీక్వెల్‌గా వస్తోంది. ఈసారి కథలోకి సౌత్ సెన్సేషన్ జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. ఇది తారక్‌కు బాలీవుడ్లో మొదటి స్టెప్ కావడం విశేషం. యాక్షన్ లవర్స్ కోసం సరిగ్గా రూపొందించిన ఈ చిత్రం ట్రైలర్లో ఎన్టీఆర్, హృతిక్‌కి మధ్య పాన్-ఇండియా లెవల్ ఫేసాఫ్ ని చూపించడం అభిమానులకు పండగలా మారింది.
తాజాగా విడుదలైన ట్రైలర్ తెలుగు, హిందీ, తమిళం భాషలలో ఒకేసారి రిలీజ్ అయింది. ఇందులో ఎన్టీఆర్ పాత్రలో పవర్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ బ్లాక్ లు సినిమాకు హైపే కాదు, రేంజ్ మార్చేలా ఉన్నాయి. అలాగే హృతిక్ కూడా తన మ్యాచో మానరిజంలతో స్క్రీన్‌ను ఆకట్టుకున్నాడు. ఏ స్క్రీన్ ప్లే, ఏ విజువల్స్ అన్నట్టు ట్రైలర్ ఆకట్టుకుంది.
డైరెక్టర్: అయాన్ ముఖర్జీ
రిలీజ్ డేట్: 14 ఆగస్ట్ 2025 (వరల్డ్ వైడ్)
YRF స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన చిత్రం
స్టార్స్: హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్
తెలుగు హక్కులు: సితార ఎంటర్టైన్మెంట్స్ – నాగవంశీ సొంతం చేసుకున్నారు
ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు, ఇంటెన్స్ స్టెయిలింగ్, హై ప్రొడక్షన్ విలువలు—అన్ని కలిపి సినిమాపై గ్లోబల్ లెవల్ హైప్ పెంచుతున్నాయి. ఇక ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. సోషల్ మీడియాలో #War2Trailer, #NTRxHrithik అనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి.
You’ve taken sides before… But this time, everything changes.
#War2Trailer is out!#War2 only in theatres from 14th August. Releasing in Hindi, Telugu and Tamil. @iHrithik @advani_kiara #AyanMukerji #YRFSpyUniverse @yrf pic.twitter.com/jb4848yFA7
— Jr NTR (@tarak9999) July 25, 2025
చెప్పాలంటే, ఎన్టీఆర్ – హృతిక్ మాస్ & మాస్ మిక్స్‌తో వచ్చిన వార్ 2, 2025 ఆగస్టులో బాక్సాఫీస్ రికార్డులను పునర్రచన చేయనుందని క్లారిటీ వచ్చేసింది. ట్రైలర్‌నే చూస్తే… మిగిలిన సినిమా ఇంకా ఎరేంజ్ లో ఉంటుందో తెలియాలి అంటే ఆగష్టు 14 వరకు ఆగాల్సిందే!
