Satyaraj: సత్యరాజ్.. ఈ పేరు వినగానే కొన్ని సెకన్లు ఆలోచించాల్సొస్తుంది. కానీ “కట్టప్ప” అని పేరు చెప్పగానే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల కళ్ల ముందు బాహుబలిలోని ఆ గొప్ప పాత్రే మెదులుతుంది. దశాబ్దాలు పాటు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి, తనదైన ముద్ర వేసుకున్న ఈ నటుడి వ్యక్తిగత జీవితం గురించి మాత్రం చాలా మందికి తెలియదు.
Satyaraj: సత్యరాజ్ కుమారుడు తమిళ సినిమా రంగంలో నటుడిగా స్లోగా ఎదుగుతున్నా, ఆయన కూతురు మాత్రం పూర్తిగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. దివ్య సత్యరాజ్, ఓ ఫేమస్ న్యూట్రిషనిస్ట్. సినిమా నుంచి దూరంగా ఉన్నప్పటికీ, సామాజిక మాధ్యమాల్లో ఎంతో యాక్టివ్. ప్రజలకు ఆరోగ్యం గురించి, పోషకాహారానికి సంబంధించిన అంశాలపై వరుసగా అవగాహన కలిగిస్తూ గుర్తింపు పొందారు.
ఇది కూడా చదవండి: Australia: ఎగరకుండానే కుప్పకూలిన ఆస్ట్రేలియా తొలి రాకెట్! కానీ సీఈవోకి మాత్రం హ్యాపీనే..!
Satyaraj: అయితే ఇటీవల ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేయడం అంతటితోనే వార్తల్లో నిలిచింది. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీలో ఆమెకి కీలక స్థానం దక్కింది. ప్రస్తుతం పార్టీ ఐటీ విభాగం డిప్యూటీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీని ద్వారా ఆమె కేవలం పోషకాహార నిపుణిగా కాకుండా, రాజకీయ రంగంలోనూ తన సత్తా చాటుతున్నారు.
Satyaraj: సత్యరాజ్ కూతురు అనే పేరు ఓ ప్రత్యేక గుర్తింపు కలిగించినా, దివ్య తనదైన ప్రాముఖ్యతను సంపాదించుకోవడంలో విఫలంకాకపోయారు. ఆమె వ్యక్తిత్వం, స్పష్టమైన అభిప్రాయాలు, ప్రజల సమస్యలపై స్పందించే తీరు యువతలోకి ఆకర్షణగా మారుతోంది.
ఇప్పుడు తమిళ రాజకీయాల్లో యువతకు నూతన శక్తిగా, మార్గదర్శకంగా అవతరిస్తోంది దివ్య సత్యరాజ్. సింపుల్గా ఉన్నా, శక్తివంతమైన అభిప్రాయాలతో ఆమె రాజకీయాల్లో సెన్సేషన్గా మారడాన్ని ఇప్పుడు మీడియా, ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. తస్సాదియ్యా.. కట్టప్ప కూతురే కానీ.. ఇప్పుడు మిగతా నాయకులకు తలనొప్పిగా మారింది! అనే కామెంట్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
