Lifestyle: పిల్లలకు ఫోన్లు ఇస్తున్నారా? ఎంత డేంజరో తెలుసా..

Lifestyle: ఇప్పటి కాలంలో స్మార్ట్‌ఫోన్లు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయాయి. పెద్దలతో పాటు చిన్న పిల్లలు కూడా వీటికి అలవాటు పడుతున్నారు. స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చాక బయట ఆడుకోవడం, తోబుట్టువులతో గడపడం మానేసి ఎక్కువ సమయం మొబైల్‌ ఫోన్లలో గడుపుతున్నారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు మొండిగా ఉండటంతో వారి చేతికి ఫోన్లు ఇచ్చి రిలాక్స్‌ అవుతున్నారు. కానీ ఇది ఎంత డేంజరస్‌ అనేది చాలామందికి తెలియదు.

మొబైల్‌ ఫోన్లకు బానిసలైన పిల్లల్లో ఏకాగ్రత తగ్గిపోతుంది. చదువులు, సృజనాత్మకత ప్రభావితం అవుతాయి. చిరాకు, కోపం ఎక్కువై మానసికంగా అస్థిరత పెరుగుతుంది.

రాత్రిపూట ఎక్కువసేపు ఫోన్లు చూడడం వల్ల పిల్లలకు నిద్ర సరిగా రాదు. ఫోన్‌ స్క్రీన్‌ నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్ర నియంత్రించే మెలటోనిన్ హార్మోన్‌పై ప్రభావం చూపుతుంది. దీంతో నిద్రలేమి సమస్యలు వస్తాయి.

స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే కాంతి పిల్లల కళ్ళకు హానికరం. కంటి చికాకు, నీరు కారడం, అస్పష్ట దృష్టి సమస్యలు ఎదురవుతాయి.

ఫోన్‌తో ఎక్కువసేపు కూర్చుని గడిపే పిల్లలు బహిరంగ ఆటలకు దూరమవుతారు. దీని వల్ల శారీరక శ్రమ తగ్గి, బరువు పెరగడం, ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంటుంది.

ఫోన్‌లో ఎక్కువ సమయం గడిపే పిల్లలు ఇతరులతో కలవడం, మాట్లాడడం తగ్గిస్తారు. దీని వల్ల కమ్యూనికేషన్ నైపుణ్యాలు, చురుకుదనం, ఆత్మవిశ్వాసం దెబ్బతింటాయి.

 తల్లిదండ్రులు పిల్లలకు అవసరమైనప్పుడు మాత్రమే ఫోన్లు ఇవ్వాలి. వారిని బహిరంగ ఆటలు, పుస్తకాలు, సృజనాత్మక పనులవైపు దారితీయడం ద్వారా ఆరోగ్యకరమైన అలవాట్లు పెంచడం మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *