Viral Video: థాయిలాండ్‌లో వింత మార్కెట్.. ఏకంగా మొసళ్ళతోనే.. నెటిజన్లు షాక్!

Viral Video: ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంటుంది. అయితే, తాజాగా బయటకు వచ్చిన ఒక వీడియో నెటిజన్లను నోరెళ్లబెట్టేలా చేసింది.

Viral Video: ఒక యువతి థాయిలాండ్‌లోని స్థానిక మార్కెట్‌ను సందర్శించి వీడియో తీశారు. ఆ వీడియోలో సాధారణంగా కూరగాయలు, పండ్లు లేదా చేపలు కనిపించవు. బదులుగా, మొసలి మాంసం మరియు వాటి తలలు టేబుళ్లపై అమర్చబడి ఉన్నాయి. అక్కడి ప్రజలు మొసలి మాంసాన్ని ఎంతో ఇష్టంగా తింటారని ఆ యువతి చెబుతుంది. అంతేకాకుండా, కొన్ని స్టాళ్లలో మొసలి దంతాలు కూడా అమ్ముతున్నారని తెలిపింది.

ఇది కూడా చదవండి: Apple Foldable Phone: ఆపిల్ లవర్స్ కి శుభవార్త.. తొలి ఫోల్డబుల్ ఐఫోన్ రాబోతోంది! బయటపడిన లీకులు

వీడియోలో ఒక దుకాణదారుడు ఆ యువతిని చూసి – “ఏ మొసలి తినాలనుకుంటున్నావు?” అని అడగగా, ఆమె భయంతో వెంటనే “వద్దు” అని చెప్పేసింది. ప్రజలు మొసలి తలలను అలంకరణ కోసమే ఉంచారని ఆమె వివరిస్తూ ఆశ్చర్యానికి గురయ్యింది.

నెటిజన్ల స్పందనలు ఈ వీడియోను సంజలిక అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేయగా, అది 15 మిలియన్లకు పైగా వీక్షణలు, లక్షల్లో లైక్‌లు, వేలల్లో కామెంట్లు సంపాదించింది. “మన దగ్గర చికెన్, మటన్ చూసి గందరగోళం పడతారు.. వీళ్లు అయితే మొసలే తింటున్నారు” అని ఒకరు రాశారు.

“మొసలి తినడానికి ధైర్యం ఉంటే, ప్రపంచంలో ఏదైనా తినవచ్చు” అని మరొకరు కామెంట్ చేశారు. కొంతమంది మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇలాంటి జంతువులను తినడం వల్ల ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మొత్తానికి, ఈ మొసలి మార్కెట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Sanjhalika Shokeen (@sanjhalika)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *